తెలుగువారి ఆత్మ గౌరవ నినాదంతో టీడీపీని అన్న ఎన్టీఆర్ స్థాపించిన సంగతి తెలిసిందే. పార్టీ పెట్టిన తర్వాత రాష్ట్రం నలుమూలలా అన్నగారు సుడిగాలి పర్యటన చేశారు. చైతన్య రథం ఎక్కి నియోజకవర్గాలన్నీ కలియదిరిగారు. అన్నగారి తనయుడు హరికృష్ణ చైతన్య రథాన్ని నడిపారు. అయితే, ఆ చైతన్య రథం గురించిన ఒక విషయం ఇపుడు చర్చనీయాంశమైంది. చైతన్య రథానికి ఆయిల్ ఫ్రీగా కొడతామని అన్నగారి అభిమాని ఆఫర్ ఇచ్చినా…హరికృష్ణ స్వీకరించలేదన్న విషయం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విజయవాడలోని ఆటోనగర్ లో లోకేష్ స్థానికులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక పెద్దాయన తన అనుభవాలను లోకేష్ తో పంచుకున్నారు. ఆటోనగర్ లో పెట్రోల్ బంక్ యజమాని అయిన ఆ పెద్దాయని ఆనాటి ఘటనను గుర్తు చేసుకున్నారు.
అన్నగారి చైతన్యరథం ఆటోనగర్ లోనే తయారయిందని, అప్పుడు హరికృష్ణ గారు ఇక్కడే ఉండేవారని గుర్తు చేసుకున్నారు. చైతన్య రథానికి ఫ్రీగా ఆయిల్ కొడతాం, డబ్బులు తీసుకోము అంటే .. మా నాన్నగారు ఒప్పుకోరండి అని డబ్బులు ఇచ్చి వెళ్లేవారు హరికృష్ణ గారు అంటూ ఆనాటి సంగతులు నెమరు వేసుకున్నారు. ఈ మాట వినగానే లోకేష్ తో పాటు సభికులంతా చప్పట్లు కొట్టారు. అన్నగారితో పాటు ఆయన తనయుల నిబద్ధత గురించి అంతా కొనియాడారు.
కాగా, ఎన్నికల ప్రచారం కోసం అన్నగారు ఉపయోగించిన చైతన్య రథం కొద్ది రోజుల క్రితం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కనిపించిన సంగతి తెలిసిందే. శకపురుషుడి శత జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సభా వేదిక వద్ద ప్రత్యేక ఆకర్షణగా ఆ రథం నిలిచింది. ఇప్పటికీ ఆ చైతన్య రథం చెక్కుచెదరకుండా ఉండేలాగా మరమ్మతులు చేయించి దానిని సభాస్థలి వద్దకు తీసుకువచ్చారు. ఆ సభలో అన్నగారి చైతన్య రథం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఆటోనగర్ లో బంక్ యజమాని :
అన్నగారి చైతన్యరథం ఆటోనగర్ లోనే తయారయింది .. అప్పుడు హరికృష్ణ గారు ఇక్కడే వుండే వారు .. ఆయిల్ కొడతాము కానీ డబ్బులు తీసుకోమండి అంటే .. మా నాన్నగారు ఒప్పుకోరండి అని డబ్బులు ఇచ్చి వెళ్లేవారు హరికృష్ణ గారు #LokeshinVijayawada #YuvaGalamLokesh #NaraKokesh pic.twitter.com/CLxcwwAqlV
— Gangadhar Thati (@GangadharThati) August 20, 2023