రిస్కీ షాట్స్ తీసేటప్పుడు సెట్లో ప్రమాదాలు జరుగుతుంటాయి. నటీనటులతో పాటు ఇతర యూనిట్ సభ్యులు కూడా పలు సందర్భాల్లో గాయపడుతుంటారు. అయితే ఓ హాలీవుడ్ మూవీ షూటింగ్లో ఎవరూ ఊహించని ప్రమాదం జరిగింది. గన్ పేలి సినిమాటోగ్రాఫర్ మృత్యువాత పడింది.
ప్రముఖ హాలీవుడ్ నటుడు అలెక్ బాల్డ్విన్ కొత్త సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యాక్షన్ సీన్స్ తీస్తున్నారు. అయితే ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలీదు.. ఉన్నట్టుండి బాల్డ్విన్ చేతిలో ఉన్న గన్ పేలింది. సినిమాటోగ్రాఫర్ హలినా హషిన్స్ గుండెల్లోకి తూటా దూసుకుపోవడంతో ఆమె అక్కడిక్కడే మరణించింది. డైరెక్టర్ కూడా గాయపడటంతో హాస్పిటల్‌కి తరలించారు. ఆయన కోలుకుంటున్నారు.
ఈ సంఘటనతో టీమ్ అంతా షాకయ్యారు. అసలు షూటింగ్లో తుపాకి పేలడమేంటి, మనిషి చనిపోవడమేంటి అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏం జరిగిందో తనకి ఇప్పటికీ అర్థం కావడం లేదని, ఓ టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ ప్రాణం తనవల్ల పోవడం తట్టుకోలేకపోతున్నానని బాల్డ్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఈ ఇన్సిడెంట్‌పై రియాక్టయ్యింది. ఇది చాలా షాకింగ్‌గా ఉందని, వినడానికే చాలా బాధ కలిగిస్తోందని అన్న కంగనా.. యేటా మన దేశంలో కూడా చాలామంది షూటింగుల్లో గాయపడుతున్నారని, కొందరు చనిపోతున్నారు కూడానని, ఇప్పటికైనా అందరూ జాగ్రత్తగా ఉండాలని, రిస్కీ షాట్స్ చేసేటప్పుడు తగినంత కేర్ అవసరమని చెప్పింది.