ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు, ఫైర్ బ్రాండ్ ఆమంచి కృష్ణమోహన్ వ్యవహారంపై వైసీపీ నేతల మధ్య ఆసక్తికర చర్చ సాగుతోంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నేతల మధ్య సాగుతున్న ఈ చర్చలో ఆమంచి టాపిక్కే ప్రధాన సరుకుగా ఉండడం గమనార్హం.
చీరాల నియోజ క వర్గం నుంచి తాను అంగుళం కూడా కదిలేది లేదని.. ఆమంచి ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏదైనా ఉంటే. స్వయంగా జగన్‌తోనే మాట్లాడుకుంటానని కూడా ఆయన చెప్పుకురావడం గమనార్హం. టీడీపీ తరఫున గెలిచిన కరణం బలరామకృష్ణమూర్తి.. కొన్నాళ్ల కిందట తన కుమారుడు వెంకటేష్ కోసం.. వైసీపీ మద్దతు దారుగా మారారు.
అయితే.. వచ్చే ఎన్నికల్లో వెంకటేష్‌కు అద్దంకి నియోజకవర్గం కేటాయించేందుకు వైసీపీ అధినేత జగన్ మొగ్గు చూపారు. ఒకవేళ కాదంటే.. పరుచూరును తీసుకోవాలని కూడా చెప్పినట్టు కొన్నాళ్ల కిందటే వార్తలు వచ్చాయి. మొత్తానికి ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒకటి తేల్చుకోవాలని.. తండ్రీ కొడుకులకు స్పష్టం చేశారు. దీనికి వారు ఓకే కూడా అన్నారు.
అయితే.. కొన్నాళ్లు గడిచేసరికి.. కరణం మదిలో ఆందోళన మొదలైంది. అటు పరుచూరులో టీడీపీ నేత.. ఏలూరి సాంబశివరావు.. వ్యక్తిగత ఇమేజ్‌తో సూపర్ సోనిక్ మాదిరిగా దూసుకుపోతున్నారు. దీంతో అక్కడ నుంచి పోటీ చేసినా.. ప్రయోజనం ఉండదని నిర్ణయానికి వచ్చారు.
పోనీ.. అద్దంకి నుంచి అయినా..తన కుమారుడిని బరిలో నిలుపుదామా? అంటే.. దీనిపై ఆయనకు మరి న్ని సందేహాలు ఉన్నాయి. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న గొట్టిపాటి రవి కుమార్ ఏ క్షణంలో అయినా సైకిల్ దిగి.. జగన్‌కు మద్దతు దారే మారే అవకాశం కనిపిస్తోందని టాక్. దీంతో ఆయన చీరాలలోనే సెటిల్ అ వ్వాలని నిర్ణయించేసుకున్నారు.
ఈక్రమంలోనే ఆమంచితో నువ్వా-నేనే అనే రేంజ్లో పోరాడుతు న్నా రు. అయిన దానికీ కాని దానికీ కూడా కయ్యానికి సిద్ధమవుతున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీలో.. కరణంను ఎందుకు తీసుకున్నామా? అనే ఆలోచన వస్తోందని అంటున్నారు సీనియర్లు. ఆమంచి ఒకింత తగ్గి ఉంటే.. జగన్ ఆయనకే ప్రాధాన్యం ఇస్తారని, వచ్చే ఎన్నికల్లో చీరాలను ఆయనకే కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి ఆమంచి దూకుడు తగ్గిస్తారో లేదో చూడాలి.