పెద్ద సినిమాలకు అర్ధ రాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ షో వేయడం ఇప్పుడు కొత్త ట్రెండుగా మారింది. గత నెల సలార్ సినిమాకు ఇలాగే అర్ధరాత్రి షో వేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సంక్రాంతికి రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమా గుంటూరు కారం కి కూడా అదే టైంలో స్పెషల్ షోలు వేశారు. కానీ తమ చిత్రానికి ఆ షోలు వేయడం పొరపాటు అయిందని అంటున్నాడు నిర్మాత నాగ వంశీ.
త్రివిక్రమ్- మహేష్ బాబు కాంబినేషన్ అనగానే మాస్ సినిమా అని ఊహించుకుని వచ్చిన అభిమానులు ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో నిరాశ చెందారని.. అందుకే అర్థరాత్రి షోల నుంచి నెగిటివ్ టాక్ వచ్చిందని నాగ వంశీ అన్నాడు.
గుంటూరు కారం ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే విషయాన్ని తాము రిలీజ్ ముందు సరిగా చెప్పలేకపోయామని భావిస్తున్నట్లు నాగ వంశీ తెలిపాడు. ఆ విషయంలో తమకు సరైన టైమ్ లేకపోయిందని అతను చెప్పాడు. జనవరి 5 వరకు తమ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోనే ఉన్నామని.. ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా హైదరాబాదులో చేయలేకపోయామని నాగ వంశీ చెప్పాడు. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లి ఉంటే.. థియేటర్లకు ప్రేక్షకులు సరైన మైండ్ సెట్ తో వచ్చే వారిని నాగవంశీ అన్నాడు.
అర్ధరాత్రి షోల నుంచి నెగిటివ్ టాక్ వచ్చిందని.. తర్వాత క్రమంగా ప్రేక్షకులు సినిమా ఏంటో అర్థం చేసుకొని పాజిటివ్ గా స్పందించారని.. గుంటూరు కారం కలెక్షన్ల విషయంలో తాము చాలా సంతృప్తిగా ఉన్నామని నాగ వంశీ చెప్పాడు. అంతిమంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాకు అర్ధరాత్రి ఒంటిగంట షో వేసి తప్పు చేసామని భావిస్తున్నట్లు నాగ వంశీ ముక్తాయించాడు.
‘గుంటూరు కారం’ హిట్ అన్న నాగవంశీ
????నవ్వు ఆపుకోలేకపోయిన దిల్ రాజు#GunturKaraamReview #DilRaju #HanuManEverywhere #HanuManRAMpage #MaheshBabu???? pic.twitter.com/s8KPWfnAqW— ChotaNews (@ChotaNewsTelugu) January 13, 2024