చంద్రబాబు వ్యవస్థలు నిర్మించుకున్నారు ..
జగన్”బాబు” గుమస్తాలను నియమించుకున్నారు
పాపం మన ముఖ్యమంత్రి అది తెలియక గుమాస్తాలతో వ్యవస్థల పై యుద్ధం మొదలుపెట్టారు.
ఏపీ రాజకీయాల్లో విచిత్రమైన విషయలు చర్చకు వస్తున్నాయి.నవ్యాంధ్రప్రదేశ్‌ను పాలకులుగా ఉన్న ఇద్దరు నేతల విషయంలో దూర దృష్టి, కృషి, వారి మనస్తత్వం.. వంటివి చర్చకు వస్తున్నాయి.గతంలో(1995-2004) చంద్రబాబు తోమిదేళ్లు రాష్ట్రాన్ని పాలించారు మళ్ళీ 5 ఏళ్ళు 2014 నుండీ 2019.ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ పాలిస్తున్నారు.
చంద్రబాబు హయాంలో ఏపీపేరు దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా మార్మోగింది. చంద్రబాబు దూరదృష్టి, వ్యవస్థలను ఆయన ఏవిధంగా కాపాడుకుంటూ వచ్చారు.కీలక మైన విషయాలను ఎలా డీల్ చేశారు? అనే విషయాలు ఆసక్తిగా ఉన్నాయి. నేటికీ పాఠాలుగా కూడా ఉన్నాయంటే అతిశయోక్తికాదు.
అదేసమయంలో తండ్రి బొమ్మ చూపించి యువ నాయకుడిగా, 30 ఏళ్లపాటు ఈ రాష్ట్రాన్నిపాలించాలనే అకుంఠితమైన లక్ష్యం పెట్టుకుని అధికారం చేపట్టిన జగన్ ఆయా విషయాల్లో ఎలా ముందుకు వెళ్తున్నారు? అనే అంశాలు సహజంగానే మేధావుల్లో చర్చకు వస్తున్నాయి.
చంద్రబాబును తీసుకుంటే.. రాష్ట్రపతి అబ్దుల్ కలాం వంటి మేధావిని రాష్ట్రపతిగా ప్రమోట్ చేయడంలో కీలక భూమిక పోషించారు. అదేవిధంగా దక్షిణాదికి చెందిన దేవెగౌడ వంటి సీనియర్ మోస్ట్ లీడర్‌ను ప్రధానిని చేయడంలోనూ ఆయన ఢిల్లీలో అదేవిధంగా చక్రం తిప్పారు. ఇక, ఉప రాష్ట్రపతుల ఎంపిక లోను, హైకోర్టు నిర్మాణం, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల విషయంలో అదేవిధంగా తన చాతుర్యాన్ని ప్రదర్శించారు.
ప్రధానంగా ఐటీ రంగాన్ని రాజీవ్ గాంధీ తర్వాత(ఆయన మొదలు పెట్టాక మరణించారు) చంద్రబాబు ముందుకు తీసుకువెళ్లిన విషయం దేశంలోనే పెద్ద రికార్డుగా నిలిచింది. ఇక, అమరాతిని రాజధానిగా ఎంపిక చేయడమే కాకుండా ప్రపంచ స్థాయి నగరంగా దీనిని నిలబెట్టితెలుగు వాడి నాడిని ప్రపంచానికి తెలియజేశారు.
ఇక, జగన్ వాడి బాబు విషయాన్ని పరిశీలిస్తే.. వ్యవస్థలను తన చెప్పుచేతుల్లో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
మరీ ముఖ్యంగా సమాజన్ని కులాల వారీ విభజనకు జగన్ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు.
న్యాయవ్యవస్థ గౌరవం ఆనాడు కాపాడబడితే.. ఇప్పుడు అదే న్యాయవ్యవస్తపై ఏపీ సీఎంగా జగన్ దుమ్మత్తి పోస్తున్నారనే వాదన వినిపిస్తోంది. తన సొంత బాబాయి వివేకానందరెడ్డి బాత్రూంలో హత్యకు గురైతే.. దీనిని ఇప్పటి వరకు ఛేదించలేక పోయారు. వ్యవస్థలో అవినీతి మూడు పువ్వులు ఆరు కాయలుగా పరిఢవిల్లుతోంది. మోసాలకు తిరుగులేని చిరునామాగా రాష్ట్రం మారిపోయిందని… ఇటీవలే జాతీయ క్రైం బ్యూరో.. నివేదిక చాటి చెప్పింది. మరి జగన్ ఏం చేస్తున్నట్టు? ఇదేనా? ఏపీ ప్రజలు కోరుకున్నది? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పేవాడు లేకపోగా.. అడిగేవారిపై ప్రభుత్వ వ్యతిరేకులనే ముద్రవేసి.. కేసులు పెడుతున్నారు. మొత్తంగా చూస్తే.. చంద్రబాబు నాడు వ్యవస్తలను తయారు చేస్తే.. నేడు జగన్.. తన గుమాస్తాలతో వ్యవస్థలను కూలదోసే ప్రయత్నాలు చేస్తున్నారనేది మేధావుల మాట.