మంత్రి గౌతమ్ రెడ్డి హార్ట్ ఎటాక్ తో చనిపోయిన విషాద వార్త పొద్దున్నే విన్నాం. ఆయన హఠాన్మరణం అందరినీ కలిచి వేస్తోంది. అయితే, అంత తక్కువ వయసులో ఆయన మరణం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
వారంరోజులు దుబాయ్ లో ఉండి ఆదివారమే మంత్రి హైదరాబాద్ కు చేరుకున్నారు. తనింట్లో ఉన్నపుడే ఆదివారం అర్ధరాత్రి-సోమవారం తెల్లవారుజామున తీవ్రమైన స్ట్రోక్ వచ్చినట్లు సమాచారం.
గౌతమ్ వయస్సు సుమారు 40 ల్లో ఉంటుంది. 50 ఇంకా దాటలేదు. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం నుండి మొన్నటి ఎన్నికల్లో గెలిచారు.
విదేశాల్లో చదువుకుని రాష్ట్రానికి తిరిగొచ్చి నేరుగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అంతకుముందు తమ కన్ స్ట్రక్షన్ కంపెనీ వ్యవహారాలు చూసుకునేవారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకరుగా ఉన్న గౌతమ్ తక్కువ కాలంలోనే బాగా పుంజుకున్నారు. ఆయన మీద ఒత్తిడి ఉన్నట్టు కూడా కనిపించేవాడు కాదు.
మనిషి హెల్తీగా, ఫిట్ గా కనపడేటేవాడు. మరి అలాంటి వ్యక్తి చనిపోతే ఎవరికైనా అనుమానాలు వస్తాయి కదా.
పరిశ్రమాల శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్న గౌతమ్ ప్రభుత్వంలో చురుగ్గా ఉంటున్నారు. కానీ ఏపీ లో ముఖ్యమంత్రి నిర్ణయాలు, విధానాల వల్ల గౌతమ్ రెడ్డి ఒక విఫలమంత్రిగా మిగిలిపోవాల్సి వచ్చింది. అతను ఎవరిని కలిసినా ఎంత ఒప్పిద్దాం అన్నా…. ఏపీకి వచ్చి ఎవరైనా పరిశ్రమ పెడతాడా అన్నట్లు స్పందించేవారట.
చివరకు రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొచ్చే ఉద్దేశ్యంతో గౌతమ్ దుబాయ్ లో జరిగిన దుబాయ్ ఎక్స్ పోలో అవిశ్రాంతిగా పాల్గొన్నారు. అక్కడ కూడా స్పందన శూన్యం. దీనిపై మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తాయి. ఆ ఒత్తిడి ఆయన మీద ఏమైనా భారీగా ఉందా? దావోస్ ఫలితాలు ఆయనను కలచివేశాయా? అన్నది అనుమానం.
దావోస్ గురించి ఈరోజే రేపో మీడియాతో ఆయన మాట్లాడాల్సి ఉంది. ఇంతలో ఆయనకు గుండె పోటు వచ్చింది. ఎలాంటి వారిని అయినా ఒత్తిడి కుంగదీస్తుందేమో అనిపిస్తుంది గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చూస్తుంటే.
గుండె విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయకండి బ్రదర్. డబ్బున్నా చావును ఆపలేం.