ఇప్పటి వరకు పాలన ఎలా జరిగినా.. ఓకే.. అనుకున్నారు. కారణం.. పెద్దగా ఏమీ పట్టించుకోని గవర్నర్ కారణంగా. ఇప్పటి వరకు ఎలాంటి జీవోలు తెచ్చినా.. సంతకాలు.. అయిపోయాయి. ఫలితంగా ఎవరైనా కోర్టులకు వెళ్తే.. తప్ప.. ఆయా జీవోలు, నిర్ణయాల విషయం పరిష్కారం కాలేదు. ఇదీ.. ఇప్పటి వరకు జరిగిన ఏపీ పరిపాలనలో కొన్ని విషయాలు. ముఖ్యంగా మూడు రాజధానుల విషయం.. జీవో 1 ద్వారా.. ఆర్టికల్ 19పై ఉక్కుపాదం వంటివి వివాదంగా మారాయి.
అయితే..ఇక.. ఇలాంటివి ఏమాత్రం కుదరని అంటున్నారు పరిశీలకులు. టీడీపీ నాయకులు కూడా తమ కు ఒకింత న్యాయం జరుగుతుందని.. భావిస్తున్నారు. ప్రస్తుతం ఏపీకి కొత్త గవర్నర్ వచ్చారు. ఆయన రాజ్యాంగ కోవిదుడు కావడం.. న్యాయమూర్తిగా ఇటీవల రిటైర్ కావడంతో.. చాలానే జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. అదేసమయంలో తొలి సారి గవర్నర్గా నియమితులైన నేపథ్యంలో మరింత అప్రమత్తం గా ఆయన వ్యవహరించే అవకాశం ఉంది.
దీంతో సీఎం జగన్ కానీ.. ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ.. ఒకటికి నాలుగు సార్లు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని.. ఒకటికి రెండుసార్లు..పరిశీలించుకోవాల్
ఈ నేపథ్యంలో దీనికి అనుమతి లబించడం కూడా కష్టమేనని అంటున్నారుపరిశీలకులు. ఇదిలావుంటే.. ప్రతిపక్షాలు మాత్రం ఒకింత ఆనందంతో ఉన్నాయి. ఎందుకంటే.. ప్రతిపక్షాల గళం వినిపించేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నాయి. మరి గవర్నర్ ఇంతమంది ఆశలను ఏమేరకు నెరవేరుస్తారో చూడాలి.