రీతు వర్మ.. ఈ తెలుగందం గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు పొందింది. `ఎవడే సుబ్రహ్మణ్యం` సినిమాతో వెలుగులోకి వచ్చిన రీతు వర్మ.. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన `పెళ్లి చూపులు` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
ఈ మూవీ అనంతరం రీతు వర్మకు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చాయి. కానీ సక్సెస్ ను మాత్రం తన వశం చేసుకోలేకపోయింది. రీతు వర్మ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. రీసెంట్ గా ఈ బ్యూటీ `ఒకే ఒక జీవితం` సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అయితే ఇందులో రీతు వర్మ పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత ఉండదు.
ఆమె పాత్ర నిడివి కూడా చాలా తక్కువగా ఉంటుంది. దాంతో ఈ సినిమా హిట్ అయినప్పటికీ రీతు వర్మకు ఒరిగిందేమీ లేకుండా పోయింది. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలెవరు రీతు వర్మను పట్టించుకోవడం లేదు. అయినాసరే ఈ అమ్మడు టాలీవుడ్ లో హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది.
ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా తన అందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కెరీర్ ఆరంభం నుండి స్కిన్ షో కి దూరంగా ఉంటూ వస్తున్న రీతు వర్మ.. ఇటీవల మాత్రం బౌండరీలు చెరిపేసి గ్లామర్ షోతో కుర్రకారుకు మంచి ట్రీట్ ఇస్తుంది. తాజాగా కూడా బ్లాక్ అండ్ వైట్ ట్రెండీ థైస్ స్ప్లిట్ డ్రెస్ ను ధరించిన రీతు.. చెవులకు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని, హై హిల్స్ వేసుకుని సూపర్ హాట్ గా దర్శనమిచ్చింది.
ముఖ్యంగా థండర్ థైస్ ను ఎలివేట్ చేస్తూ మైండ్ బ్లాక్ చేసే విధంగా ఫోటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం రీతు వర్మ లేటెస్ట్ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ ను చూసిన నెటిజన్లు థండర్ థైస్ తో కవ్వింపులు తగునా రీతు అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఆమె పిక్స్ పై అభిమానులు లైకుల వర్షం కురిపిస్తున్నారు.
కాగా, సినిమాల విషయానికి వస్తే.. రీతు చేతిలో ఇప్పుడు ఒక్క తెలుగు ప్రాజెక్ట్ కూడా లేదని తెలుస్తోంది. అయితే తమిళ, మలయాళ భాషల్లో ఒకట్రెండు చిత్రాలు చేస్తుంది . అలాగే రీతు వర్మ నటించిన `ఆకాశం` సినిమా తాజాగా విడుదల అయింది. అశోక్ సెల్వన్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 4 న విడుదలై మంచి రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ఇందులో రీతు వర్మ తో పాటు శివాత్మిక రాజశేఖర్, అపర్ణ బాలమురళి హీరోయిన్లుగా నటించారు. హృదయాన్ని హత్తుకునే మూడు ప్రేమ కథలను ఈ చిత్రంలో చూపించారు.