సెటైర్లు వేయడంలో తెలుగుదేశం మొత్తం మీద బుచ్చయ్య చౌదరి తీరే వేరు
ఏమైనా గోదారోళ్లు అంటే మామూలుగా ఉండదు మరి
మిగతా వాళ్ల విమర్శలు, తిట్లను కూడా వైసీపీ వాళ్లు తట్టుకోగలుగుతున్నారు గాని
గురిచూసి కొట్టే బుచ్చయ్య సెటైర్లతో పార్టీ పరువు ప్రభుత్వ పరువు పోతుంటే ఏం చేయాలో తెలియక పిచ్చోళ్లు అవుతున్నారు.
….
మొన్నే మీ కరెంటు బిల్లు తెలుగుదేశం పార్టీ సర్కారు ఉన్నప్పటి కంటే ఇపుడు తక్కువ వస్తుంది ఎవరు నిరూపించినా వారి బిల్లు నేనే కడతా అంటూ బుచ్చయ్య చౌదరి విసిరిన ఛాలెంజ్ కి ఇంకా ఎవరూ స్పందించనేలేదు.
స్పందించడానికి వారికి ఛాన్సెక్కడుంది.
ఆడోళ్లు అంతా జగన్ను విద్యుత్ ధరలపై దుమ్మెత్తిపోస్తుంటే వైసీపీ వారి నోట మాట రావడం లేదు.
…
ఇంతలో బుచ్చయ్య చౌదరి మరో బుల్లెట్ వేశాడు
ఇపుడు వైసీపీ నేతలు లాక్కోలేక పీక్కోలేక చస్తున్నారు.
సామాన్యుడు బ్రతికే అవకాశం ఈ ప్రభుత్వం పాలన లో ఉందా? మా పాలన లో పలానా వస్తువు రేటు తగ్గింది అని చెప్పగలరా..
'నాడు-నేడు'ముఖ్యమంత్రి @ysjagan గారు?@YSRCParty నాయకుల్లో ఎవరైనా సమాధానం చెప్పగలరా..?#గోరంట్ల#YCPGovt_BreakingBackOf_ApMiddleClass pic.twitter.com/nMoeu3ieHt— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) July 21, 2021
వైసీపీ ధరలు ఎంత దారుణంగా పెంచుతుందన్న విషయాన్ని ఎంతో స్పష్టంగా క్లియర్ గా చెప్పేశారు బుచ్చయ్య చౌదరి. ఆయన ఫ్యాన్స్ అందరూ యు ఆర్ రాకింగ్ సార్ అంటున్నారు.
ఈ పోస్టును టీడీపీ వాళ్లు తెగ షేర్ చేసుకుంటున్నారు.