జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గంలో పార్టీ బలోపేతం మరియు మినీ మేనిఫెస్టో ప్రజలకు చేరువేయట కొరకు శృంగవరపుకోట నియోజకవర్గంలో భాగమైన కొత్తవలస మండలం , దేవాడ గ్రామం లో గల సీనియర్ నాయకులు దూది కనకారావు(మాజీ ప్రెసిడెంట్ దేవాడ గ్రామం), సానబోనా రమణ(మాజీ వైస్ ప్రెసిడెంట్ దేవాడ గ్రామం , కోమటి వెంకటరమణ, ఈశ్వర్ రావు, సన్యాసిరావు గల సీనియర్ నాయకులును శృంగవరపుకోట నియోజకవర్గం యువనేత మరియు తెలుగుదేశం రాష్ట్ర పార్టీ కార్యదర్శి ‘గొంప క్రిష్ణ’, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కలవడం జరిగింది.
రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రస్థాయిలో అధికారం చేపట్టాలని చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని అదే విధంగా నియోజకవర్గంలో మన పార్టీని మునుపుటి వలె పటిష్టంగా తయారు చేస్తూ అధికారంలోకి తీసుకురావాలని దానికోసం మనమంతా క్షేత్రస్థాయిలో కష్టపడి చంద్రబాబు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలు మన్ననలు పొందాలని నాయకులకు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మీ అనుభవాలు సలహాలు సూచనలతో మన పార్టీ అభివృద్ధికి మరియు నియోజకవర్గంలో గెలుపుకు మీ అందరూ కీలకపాత్ర వహించి ముందుకు సాగాలని నియోజకవర్గ యువనేత ‘గొంప క్రిష్ణ’తెలియజేశారు.
అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మేనిఫెస్టో లో భాగమైన ఆరు అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దానికోసం అందరూ కృషి చేయాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో గోరపల్లి రాము (కొత్తవలస టీడీపీ మండల పార్టీ అధక్ష్యలు),బాలకృష్ణ జగ్గారావు (విశాఖ పార్లమెంట్ ఉపాధ్యక్షులు), లంక శ్రీను(విశాఖ పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు), వల్లపు ఈశ్వరరావు (మండల పార్టీ కార్యదర్శి) కర్రీ సూర్య నూకరాజు (1వ వార్డ్ మెంబెర్), గుమ్మడి కోటి(15 వ వార్డు),బి శెట్టి ప్రసాద్ (సీతంపేట వార్డ్ మెంబర్), చిపాటు వేణు గారు,ఋసాల సూర్యనారాయణ గారు(ex వార్డ్ మెంబెర్), నాగబిల్లి చెల్లయ్య, పల్లి అప్పల సత్యనారాయణగారు ,సతీష్ , చంటి ,రమణ, గాడి అంజిబాబు, పెంటరావు, నాగు దొడ్డి ఈశ్వరరావు ,మొల్లేటి ప్రకాష్, గుమ్మడి మహేష్, జగ్గారావు, గోవింద, వెంకట్రావు, ఈశ్వరరావు, దాడి శ్రీను, సుంకరపాలెం సూర్యనారాయణ , నాగిశెట్టి రమణ మరియు దేవాడ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.