మంచు కుటుంబం జనాలకు మామూలు ట్విస్టులు ఇవ్వడం లేదు. జనం కూడా వారికి అంతే రేంజ్ లో రిటార్టులు ఇస్తున్నారు. ఇటీవలి కాలంలో మంచు ఫ్యామిలీ నుంచి రెండు సినిమాలు వచ్చాయి. ఆ రెండూ డిజాస్టరే.
సన్ ఆఫ్ ఇండియా మరియు జిన్నా సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి విడుదలై బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. చరిత్రలో అత్యంత తక్కువ వసూలు చేసిన సినిమాలుగా చరిత్ర కూడా స్రుష్టించాయి.
థియేటర్లలో వీటి కలెక్ఛన్లపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడిచింది. సరే.. థియేటర్లలోకి వచ్చాయి. పోయాయి. ఇపుడు ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాలు… అందరికీ అందుబాటులో ఉన్నాయి.
అయినా వాటిని ఎవరు చూస్తారు అని కొందరు ట్రోలర్స్ కామెంట్ చేసినా… మంచు ఫ్యామిలీ మాత్రం తగ్గదేలేదు అంటూ భారీ ట్విస్ట్ ఇచ్చింది. ఇప్పుడు, సన్ ఆఫ్ ఇండియా మరియు జిన్నా రెండూ OTTలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. కానీ ఫ్రీ కాదంట. ట్విస్ట్ అదిరింది కదా.
వెయిట్. ఇండియాలో వీటిని ఫ్రీగా చూడొచ్చు గాని అమెరికాలో ఎన్నారైలు చూడాలంటే మాత్రం ప్రామాణిక సబ్‌స్క్రిప్షన్‌తో USAలోని ప్రైమ్ వీడియో సబ్స్క్రైబర్లకు ఫిల్మ్‌లు అందుబాటులో లేవు. ఈ రెండు సినిమాలు USAలో పే పర్ వ్యూ ప్రాతిపదికన ప్రసారం అవుతున్నాయి.
ప్రైమ్‌లో చూడటానికి వినియోగదారు వీటిని $2.99కి అద్దెకు తీసుకోవాలి. ఇది థియేటర్లలో విడుదలైన చాలా నెలల తర్వాత కూడా చిత్రాలను వీక్షణ ప్రాతిపదికన వేతన ప్రాతిపదికన విడుదల చేయాల్సిన అవసరం ఏమిటనే దానిపై ఒక వర్గాన్ని గందరగోళానికి గురిచేసింది.