మంచు ఫ్యామిలీ సోషల్ మీడియాలో, బయట చేసే హడావుడికి.. వాళ్ల సినిమాలకు జనాల నుంచి వచ్చే స్పందనకు అసలు పొంతన ఉండదు. తాజాగా మంచు విష్ణు సినిమా ’జిన్నా’ ( Ginna movie ) విడుదల కానుంది.
ఈ ఏడాది ఆరంభంలో మంచు మోహన్ బాబు సినిమా ‘సన్ ఆఫ్ ఇండియా’ రిలీజ్ సందర్భంగా నెలకొన్న హడావుడి గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఎలా ఉండబోతోంది.. ఎలా ఉంది అన్న చర్చే లేదు.
ఇంకొన్ని గంటల్లో షో పడబోతుండగా.. పెద్ద పెద్ద థియేటర్లలో ఒక్కటంటే ఒక్క టికెట్ కూడా అమ్ముడవకుండా ఉండిపోవడంపై ఒక రేంజిలో ట్రోలింగ్ జరిగింది.
ఆ పరిణామం మంచు ఫ్యామిలీకి అవమాన భారాన్ని మిగిల్చింది. దీని మీద రెండు రోజుల పాటు నెటిజన్లు రెచ్చిపోయారు. మోహన్ బాబుతో పాటు మంచు విష్ణును కూడా విపరీతంగా ట్రోల్ చేశారు.
కట్ చేస్తే ఇప్పుడు మంచు విష్ణుకు కూడా అదే అనుభవం ఎదురవుతోంది. అతను ఎంతో హడావుడి చేసి, బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తున్న ‘జిన్నా’ సినిమాను అస్సలు ప్రేక్షకులు పట్టించుకుంటున్నట్లు లేరు.
దీపావళికి ‘జిన్నా’తో పాటు రిలీజవుతున్న ‘ఓరి దేవుడా’, ‘ప్రిన్స్’, ‘సర్దార్’ చిత్రాలకే ఎక్కువ బజ్ కనిపిస్తోంది. గత వారం విడుదలైన మరో అనువాద చిత్రం ‘కాంతార’ ఇంకా అదరగొడుతుండగా.. ప్రేక్షకుల దృష్టి మిగతా మూడు చిత్రాల మీద ఉందే తప్ప మంచు వారి సినిమాను కనీసం పట్టించుకోవడం లేదు.
హైదరాబాద్లో చాలా థియేటర్లలో రిలీజ్ ముందు రోజు ఈ సినిమాకు ఒక్కటంటే ఒక్క టికెట్ అమ్ముడుబోని పరిస్థితి. ఒకటీ అరా షోలకు మాత్రమే కొన్ని టికెట్లు తెగాయి. కనీసం ఒక్క టికెట్ కూడా బుక్ కాని థియేటర్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి.
విష్ణు ట్రాక్ రికార్డు చాలా ఘోరంగా ఉండడం, ‘మా’ ఎన్నికల సందర్భంగా, ఆ తర్వాత అతను చేసిన ఓవరాక్షన్ జనాలకు మంచు ఫ్యామిలీ పట్ల తీవ్ర వ్యతిరేక భావాన్ని పెంచినట్లుంది. అదే పనిగా తమ సినిమాలను టార్గెట్ చేస్తున్నారని, ట్రోల్ చేస్తున్నారని ఎంత కవర్ చేసినా సరే.. ఇలా ఒక్క టికెట్ కూడా బుక్ కాలేదంటే జనాలకు మంచు ఫ్యామిలీ మీద ఏ స్థాయిలో మొహం మొత్తేసిందో అర్థం చేసుకోవచ్చు.
Going to #Ginna with my bamby#GinnaOn21stOct pic.twitter.com/9tlOCGq0El
— ChinnaPillodu ®©™ (@ViswaRakshakudu) October 20, 2022