పవన్ జనసేన… తెలుగుదేశం పార్టీ సంయుక్త కార్యక్రమాలు అపుడే మొదలైపోయాయి. గుంటూరు జిల్లాలో తాజాగా జరిగిన చంద్రబాబు పర్యటనలో జనసేన జెండాలు రెపరెపలాడాయి.
పలువురు జనసేన కార్యకర్తలు తమ బైకులకు రెండు పార్టీల జెండాలు కట్టుకుని తిరిగారు. చాలామంది జనసైనికులు తమ పార్టీ జెండాను పట్టుకుని సభకు హాజరయ్యారు.
ముందు నుంచి పవన్ అంటే వణుకుతున్న జగన్… ఈ రెండు పార్టీలు కలవకూడదని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరకు జగనే రెండు పార్టీలను కలిపాడు. రాజకీయ పార్టీలకు తమ కార్యక్రమాలు చేసుకుని స్వేచ్ఛ ఉంటుందన్న కనీస ఇంగితం మరిచిపోయి పోలీసులతో అడ్డుకోవడంతో రెండు పార్టీలు వైసీపీ అధికార మదాన్ని దించడానికి ఏకమయ్యాయి.
— AK4🥛 (@0nlyforPSPK) October 19, 2022