వైసీపీ నేతలు ప్రజలు ఓట్లేసి గెలిపించిన పదవులను నామినేటెడ్ పదవులు అనుకుంటున్నారు. ఏపీ జగన్ సొంత రాజ్యంలాగ, ఎమ్మెల్యేలంతా వారికి సామంత రాజుల్లా… ప్రజలంతా బానిసల్లా కనిపిస్తున్నారేమో. ఎవరైనా ప్రశ్నిస్తే కొడుతున్నారు, తిడుతున్నారు, కేసులు కూడా పెడుతున్నారు.
ప్రజాస్వామ్యంలో ఉండే కనీస స్వేచ్ఛ చట్టపరంగా ఉందన్నమాటే గాని ఏపీలో దానిని వాడితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో డాక్టర్ సుధాకర్ కేసు మొదలుకుని అనేకసార్లు నిరూపణ అయ్యింది. కోర్టు డీజీపీని పిలిచి … ఏపీలో రూల్ ఆఫ్ లా ఉందా అని బోనులో నిలబెట్టి అడిగినా ఏపీలో పరిస్థితులు మారడం లేదు.
వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నేతలు చెప్పిందే వేదం, చేసిందే పాలన అన్నట్లు… వారికి ఎవరూ ఎదురే చెప్పకూడదు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. తాజాగా గిద్దలూరు ఎమ్మెల్యే వైసీపీ నేత రాంబాబు ప్రజలను బూతులు తిట్టారు. సమస్యల గురించి చెప్పినందుకు ఆయన కు కోపం తన్నుకువచ్చింది.