జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాబోయే GHMC elections లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన క్యాడర్ బాగా కోరుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది.
అయితే, జనసేన నుంచి ఈ ట్విస్ట్ ను కేసీఆర్ గాని టీఆర్ఎస్ గానీ ఊహించలేదు. బీజేపీని ఇరుకున పెట్టే ఉద్దేశంతో అతి స్వల్పవ్యవధికి ఎన్నికల ప్రక్రియను కుదించి ప్లాన్ చేసింది టీఆర్ఎస్ పార్టీ. దుబ్బాకలో తగిలిన ఎదురు దెబ్బ నేతృత్వంలో ఈ నిర్ణయం తీసుకుంది. తక్కువ సమయం కాబట్టి బీజేపీకి అభ్యర్థులు దొరకరు అన్నది టీఆర్ఎస్ ఆలోచన.
అయితే, అనుకోకుండా GHMC ఎన్నికల్లో జనసేన రంగంలోకి దిగడం టీఆర్ఎస్ కు షాక్. చాలా వేగంగా స్పందించిన జనసేన పార్టీ… ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ పెట్టిన రోజే అభ్యర్థుల నుంచి బయోడేటా స్వీకరణ కూడా చేసి ఆశ్చర్యపరిచింది. ఈ కార్యక్రమంలో జనసేన తెలంగాణ నాయకులు, గ్రేటర్ నాయకులు పాల్గొన్నారు. జనసేన తెలంగాణలో బలంగా ఉన్నా లేకపోయినా హైదరాబాదులో చాలా బలమైన ఓటింగ్ కలిగి ఉంది.
ఒక్క కుకట్ పల్లి నియోజకవర్గంలోనే 66 వేల కాపు ఓట్లే ఉన్నాయి. ఇక మొత్తం హైదరాబాదులో పవన్ క్రేజ్ కూడా ఎక్కువే. జనసేన బీజేపీతో కలిసి నడుస్తున్న నేపథ్యంలో కచ్చితంగా ఇరు పార్టీలు సయోధ్యతోనే పోటీ చేస్తాయి. కాబట్టి… ఈ ఓట్లన్నీ గత ఎన్నికల్లో టీఆర్ఎస్ కి పడిన ఓట్లే.