అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని ఉన్నదన్నట్టుగా ఉంది ఏపీ సీఎం జగన్ రాజకీయ పరిస్థితి. ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా.. కొంత దూర దృష్టి లేక పోలేదు. అమరావతి, పోలవరం, ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు, గత సర్కారు ఒప్పందాలను తిరగదోడడం.. వంటి కొన్ని విషయాల్లో తీవ్ర వివాదాలు జాతీయ స్థాయిలో అతని పరువును డ్యామేజ్ చేశాయి. జగన్ వ్యవహారశైలి.. దూకుడు.. తాను చెప్పిందే వినాలి.. తాను అన్నదే జరగాలనే ఓ విధమైన పోకడ వంటివి ఈ నిర్ణయాలపై మబ్బులు కమ్మేలా చేస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.
తాజాగా మరోసారి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో ప్రభుత్వానికి వివాదం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామంటూ.. ఎన్నికల కమిషనర్.. ప్రకటించడం ఈ వివాదానికి కారణంగా మారింది. ఈ క్రమంలో ప్రభుత్వంలో చర్చించి.. నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ నిమ్మగడ్డ ప్రకటించారు. దీనికి వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. ఇప్పుడున్న పరిస్థితిలో మేం చర్చలకు రాలేమని కుండబద్దలు కొట్టారు. అదేసమయంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఇది సమయం కాదని కూడా స్పష్టం చేశారు. కరోనా విషయంలో ఇతర రాష్ట్రాలకు మనకు తేడా ఉందని.. ఇక్కడ ఆరు వేల మంది మృతి చెందారని సో.. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని ఆమె తెలిపారు.
ఆ వెంటనే ఎస్ ఈసీ.. మరో లేఖ సంధించారు. మీరుఉద్దేశ పూర్వకంగానే ఎన్నికల వాయిదాను కోరుతు న్నారని. ఇప్పటికే బిహార్ ఎన్నికలు పూర్తయ్యాయని, జీహెచ్ ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింద ని.. సో.. ఎన్నికలు నిర్వహించవచ్చని ఆయన పేర్కొన్నారు. దీంతో ఇది మరోసారి తీవ్ర వివాదానికి దారి తీస్తోంది. ఇక, ఈ మొత్తం ఎపిసోడ్‌ను పరిశీలిస్తే.. గత విషయాలను పక్కన పెడితే.. ఏపీలో నిజంగానే కేసుల సంఖ్య తగ్గలేదు. ఇంకా కొనసాగుతోంది. మరణాలు కూడా కొనసాగుతున్నాయి.
కాబట్టి సర్కారు చెబుతున్న వాదనలో పస ఉంది. కానీ, గతంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎస్ ఈసీగా నిమ్మగడ్డ ఉన్నంతవరకు జగన్ సర్కారు ఎన్నికలు నిర్వహించదనే వాదన బలంగా ఉండడం తో ఇప్పుడు ప్రభుత్వం ఎన్ని కారణాలు చెబుతున్నా.. అవి నమ్మే పరిస్థితి లేకుండా పోవడం గమనార్హం. GHMC elections తో జగన్ మాటలను ఎవరూ నమ్మడం లేదు. ఉద్దేశ పూర్వకంగానే జగన్ ఆపుతున్నారని అందరికీ అర్థమవుతోంది.