గంటా పార్టీ మార్పు ఇంకా ఊగిసలాటలోనే ఉంది. ఇపుడు మారతారు అపుడు మారతారు అని వార్తలు పలుమార్లు వస్తున్నాయి. అయితే, టీడీపీ శ్రేణులు ఆయనకు ఎపుడో నీళ్లువదిలేశాయి. నిజానికి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరడానికి ఏ మాత్రం మొహమాటపడరు గంటా శ్రీనివాసరావు. అందుకే జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటగా మారే వ్యక్తి ఆయనే అనుకున్నారు.కాకపోతే సిగ్గు పడ్డారో ఏమో… లేకపోతే పార్టీలు మారి అలసిపోయారో. 2019 ఎన్నికల తర్వాత కాస్త నెమ్మదించారు.
టీడీపీని దెబ్బకొట్టేందుకు గంటాను పార్టీలోకిి తీసుకోవాలని జగన్ ఉబలాటపడుతున్నారు. అయితే, తెలుగుదేశం కార్యకర్తల పార్టీ. దానిని జంపింగ్ ల ద్వారా దెబ్బకొట్టడం అంత సులువైన పని కాదు. పరిపాలన రాజధాని అంటూ వైసీపీ చేసిన హడావుడితో ఇంకా గంటాకు పార్టీ మారక తప్పడం లేదు.
వైజాగ్ కు రాజధాని తరలే అవకాశమే లేదు. అయినా ఆ సెంటిమెంట్ మాత్రం క్రియేట్ అయ్యింది. అక్టోబర్ 3న సీఎం జగన్‌తో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భేటీ కానున్నట్లు తాజా సమాచారం. జెండా రహిత జంపింగ్ కదా…. కొడుక్కు జెండా కప్పడంతో చేరిక కంప్లీట్ చేస్తారు. వాస్తవానికి అవంతి శ్రీనివాస్, విజయసాయిరెడ్డి కు గంటారావడం ఇస్టం లేక ఇంతకాలం గంటా చేరిక ఆగింది.
చివరకు జగన్ పట్టుబట్టే సరికి ఆ ఇద్దరు సైలెంటయ్యారు. గంటా నేరుగా జగన్‌తోనే మాట్లాడుకొని చేరికకు ఏర్పాట్లు చేసుకున్నారంటున్నారు. ఆయనకు వీఎంఆర్డీఏ చైర్మన్ పదవి ఇస్తారని కూడా ప్రచారం జరుగుతోంది.
విశాఖ రాజధాని అనే సెంటిమెంట్ రగిలించి ఇప్పటికే విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్ తో పాటు గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాకు చెందిన నేతలను, ఎమ్మెల్యేలను జగన్ పార్టీలోకి లాగారు. ఫిరాయింపులు చేయని ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఈరోజు మాట మార్చారు. అప్పటి నుంచి మాట తప్పుతూనే ఉన్నారు సీఎం జగన్.
అయినా అధికారంలోకి వచ్చిన వారంలోపే సీపీఎస్ రద్దు చేస్తాను అని చెప్పి మాట తప్పినపుడే జగన్ మాటతప్పడం మడమ తిప్పడం మొదలైంది. అప్పటినుంచి అప్రతిహతంగా అనేకసార్లు మాట తప్పారు. చివరకు ముసళోళ్లకు రెండో ఏడాది పెంచాల్సిన పించను విషయంలోను మాట తప్పారు. ఆయనకు మిగతావి ఒక లెక్కా?