తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ వస్తే… రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించారు. అయితే, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన ఈ నిర్ణయం ప్రకటించినా… పనికిమాలిని ఖజానా భారం పథకాలతో పోలిస్తే ప్రజారోగ్యంపై పెట్టే ఇలాంటి ఖర్చు ఫలవంతం అని చెప్పాలి. తాజా నిర్ణయం వైరల్ అవుతోంది. నిజానికి ఇది పెద్ద బడ్జెట్ కూడా కాదని చెప్పాలి.
నిజానికి గవర్నమెంటే కాదు, ఆ మాత్రం ఖర్చును పార్టీయే పెట్టుకోగలదు. కానీ పళనిస్వామి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం మంచి మార్కులు కొట్టేశారు. కొసమెరుపు ఏంటంటే… ప్రస్తుతం రాష్ట్రంలో డీఎంకే గాలి వీస్తోంది. గత లోక్ సభ ఎన్నికల్లో ఇది ప్రూవ్ అయ్యింది. మరి ముఖ్యమంత్రి తాజా నిర్ణయం ఏ మేరకు ఆ గాలిని మళ్లించగలదో చూడాలి. అయితే లోక్ సభ ఎన్నికలు జరిగిన 2 సంవత్సరాల తర్వాత తమిళనాడు ఎన్నికలు జరుగుతున్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి.