ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా సెకండ్ వేవ్‌తో మనం ఇప్పుడు పోరాడుతున్నామని చెబుతూ మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
”ప్రపంచ డిమాండ్‌తో పోలిస్తే, అన్ని దేశాలు కలిపి ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సీన్లు చాలా తక్కువ. యుద్ధ ప్రాతిపదికన మనం ఆరోగ్య సదుపాయాలను ఏర్పాటుచేసుకున్నాం. ఆక్సిజన్ కొరత నడుమ దేశం నలుమూలల నుంచి ఆక్సిజన్‌ను సేకరించాం” అని మోదీ చెప్పారు.
మిషన్ ఇంధ్రధనుష్ కార్యక్రమంతో దేశంలో పెద్ద ఎత్తున భిన్న వ్యాక్సీన్లు ఇచ్చే ప్రక్రియను చేపట్టాం.
2014లో 60 శాతంగా ఉన్న వ్యాక్సీన్ కవరేజీ నేడు 90 శాతానికి పెరిగిందని మోదీ చెప్పారు.
ఇప్పటివరకు 23 కోట్ల డోసుల కోవిడ్-19 వ్యాక్సీన్లను ప్రజలకు ఇచ్చామన్నారు.
‘‘భారత శాస్త్రవేత్తలు చాలా వేగంగా వ్యాక్సీన్ తయారుచేస్తారని మొదట్నుంచీ నేను బలంగా విశ్వసించాను. వ్యాక్సీన్ తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం గట్టి మద్దతు, ప్రోత్సాహం అందించింది.
గత 100ఏళ్లలో ఇదే అత్యంత విధ్వంసకర మహమ్మారి. ఇలాంటి మహమ్మారిని ఆధునిక ప్రపంచం ముందెన్నడూ చూడలేదు. మన దేశం భిన్న స్థాయిలో దీనితో పోరాటం చేసింది.
ముక్కు ద్వారా వేసే వ్యాక్సీన్ కూడా మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. దీంతో వ్యాక్సీన్లు ఇచ్చే ప్రక్రియ వేగం పుంజుకుంటుంది.
మరో మూడు కొత్త వ్యాక్సీన్లు కూడా అభివృద్ధి దశలో ఉన్నాయి.
రానున్న రోజుల్లో వ్యాక్సీన్ల అందుబాటు పెరుగుతుంది. భిన్న రకాల వ్యాక్సీన్లను ఏడు సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. మూడు వ్యాక్సీన్ ట్రయల్స్ చివరి దశలకు వచ్చేశాయి.
పిల్లలకు సంబంధించి వ్యాక్సీన్ ట్రయల్స్ కూడా కొనసాగుతున్నాయి.
రాష్ట్రాల డిమాండ్ ఆధారంగా వ్యాక్సీన్ విధానాల్లో కేంద్రం మార్పులు చేసింది. ఇప్పుడు 25 శాతం పనులు రాష్ట్రాలకే అప్పగిస్తున్నాం.
అయితే, పాత విధానమే మేలైనదని కొన్ని రాష్ట్రాలు చెబుతున్నాయి. దీంతో రాష్ట్రాలకు అప్పగించిన ఆ 25 శాతం పనులను కూడా కేంద్రమే భుజానికి ఎత్తుకుంటుంది.
జూన్ 21 నుంచి 18ఏళ్లకుపైబడిన అందరికీ ఉచితంగా వ్యాక్సీన్లు ఇచ్చేందుకు సరిపడా వ్యాక్సీన్లను రాష్ట్రాలకు అందిస్తాం. రాష్ట్రాలపై భారం లేకుండా చేస్తాం” అన్నారు.
25 శాతం టీకా ప్రయివేటు ఆసుపత్రులకు పంపిణీ చేస్తామని.. ఏ ఆసుపత్రిలోనూ వ్యాక్సీన్ వేసినందుకు దాని ధర కంటే అదనంగా రూ. 150 కంటే ఎక్కువ తీసుకోకూడదని మోదీ చెప్పారు.
‘‘18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న అందరికీ ఉచితంగానే వ్యాక్సీన్లు ఇస్తాం. వ్యాక్సీన్ల అందుబాటు పెంచేందుకు విదేశాల నుంచి కూడా వ్యాక్సీన్లు తెప్పిస్తున్నాం.
ప్రైవేటు ఆసుపత్రులు గరిష్ఠంగా రూ.150 మాత్రమే వ్యాక్సినేషన్‌కు తీసుకోవాలి. వ్యాక్సీన్లలో 25 శాతం ప్రైవేటు ఆసుపత్రులకు ఇచ్చే విధానం కొనసాగుతుంది.
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని దీపావళి వరకు కొనసాగిస్తాం. వ్యాక్సీన్లపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు అందరూ కృషి చేయాలి’’ అన్నారు.
కరోనాపై చేస్తున్న యుద్ధంలో భారత్ విజయం సాధిస్తుందంటూ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.
PM Modi (@narendramodi) announces centralized vaccine drive, says all vaccines will be procured by Government of India and given to States for free. Check out major highlights from his address today. #PMModi #vaccine #vaccination #Covid19 #ITQuoteCard pic.twitter.com/6eHCQz73PX
— IndiaToday (@IndiaToday) June 7, 2021