ఏపీ అధికార వైసీపీ లో ఇప్పటి వరకు నలుగురు సిట్టింగ్ ఎంపీలు పార్టీకి దూరమయ్యారు. వీరిలో లోక్సభ సభ్యులు ముగ్గురు ఉండగా.. తాజాగా ఒక రు రాజ్యసభ మెంబర్ కావడం గమనార్హం. దీంతో ఎన్నికల నాటి కి అంటే.. మరో రెండు మాసాలకు ఇంకెంత మంది ఎంపీలు జారిపోతారో.. అనే చర్చ సొంత పార్టీలోనే సాగుతుండడం గమనార్హం. గత నెలలోనే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పార్టీకి దూరమయ్యా రు. ఆయనను గుంటూరు నుంచి పోటీచేయాలని చెప్పడంతోకినుక వహించి రాజీనామా చేశారు.
ఆ.. ఏముంది.. ఒక్కరే కదా అనుకున్నారు. ఆ మరుసటి రోజే ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు, ఇక, కర్నూలు ఎంపీ బీసీ సామాజిక వర్గానికి చెందిన కె. సంజీవ్ కుమార్ కూడా ఇదే బాట పట్టారు. ఈయనను ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేయమని కోరడంతో అలిగిపార్టీకి రిజైన్ చేశారు. ఈయన ఎటూ వెళ్లకుండా ప్రస్తుతం తటస్థంగా ఉన్నారు. అయితే.. ఈయనను తిరిగి పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆయన మెత్తబడితే వెనక్కి వచ్చే అవకాశం ఉంది.
ఇక, నరసరావుపేట లోక్ సభ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. టీడీపీ – జనసేన కూటమి తరపున అవకాశం వస్తే పోటీ చేయాలనే యోచనలో ఆయన ఉన్నారు. ఈయన కూడా పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా ఇప్పుడు వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీకి తాను చేసిన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరుతూ ఆయన జగన్ కు లేఖ రాయడం గమనార్హం. దీంతో ప్రత్యక్షంగా నలుగురు ఎంపీలు పార్టీకి దూరమయ్యారు.
మరోవైపు.. ఎప్పటి నుంచో రెబల్గాఉన్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పార్టీకి రాజీనామా చేయలేదు కానీ.. పార్టీకి దూరంగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో నరసాపురం లోక్ సభ స్థానం టీడీపీ – జనసేన కూటమిలో భాగంగా టీడీపీ నుంచి పోటీ చేయాలని రఘురామ రాజు భావిస్తున్నారు. ఇదిలావుంటే.. హిందూపురం ఎంపీ.. గోరంట్ల మాధవ్ కూడా రాజీనా మా చేసే ఆలోచనలో ఉన్నారు. ఈయనకు టికెట్ ఇవ్వలేదు. కనీసం ఎమ్మెల్యేఅ యినా ఇవ్వాలని కోరారు కానీ, పార్టీ ఇవ్వలేదు. దీంతో స్వతంత్రంగా పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంతో ఎన్నికల నాటికి మరింత మంది పార్టీకి దూరమయ్యే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.