1999 లో జార్ఖండ్ (గిరిదిహ్లోని బ్రహ్మదీహ) బొగ్గు బ్లాకును కేటాయించడంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రేకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఈ కుంభకోణంలో ఆయనతో పాటు దోషులుగా తేలిన ఇద్దరు వ్యక్తులకు ప్రత్యేక సిబిఐ కోర్టు మూడు సంవత్సరాల జైలు శిక్షను విధించింది. ఒక్కొక్కరికి ₹ 10 లక్షలు జరిమానా కూడా విధించారు.
ప్రత్యేక న్యాయమూర్తి భారత్ ప్రషార్ ఈ శిక్షను ఖరారు చేశారు. వైట్ కాలర్ నేరాలు పెరుగుతున్నాయని, సమాజానికి సందేశం పంపడానికి గరిష్ట శిక్ష అవసరమని న్యాయ మూర్తి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.దీనిపై దిలీప్ రే న్యాయవాది స్పందిస్తూ… ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్తామని అన్నారు. అలాగే బెయిలుకోసం కూడా దరఖాస్తు చేశారు. కొసమెరుపు ఏంటంటే… ఈయన కాంగ్రెస్ నేత కాదు.. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి.
ఆ సమయంలో బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు, ప్రదీప్ కుమార్ బెనర్జీ మరియు నిత్య నంద్ గౌతమ్ మరియు కాస్ట్రాన్ టెక్నాలజీస్ లిమిటెడ్ (సిటిఎల్) డైరెక్టర్ మహేంద్ర కుమార్ అగర్వాల్లాకు జీవిత ఖైదు విధించడం ఇక్కడ సంచలనం.