• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఫ్లాష్ న్యూస్: ‘తానా’ ఎన్నికల ప్రాసెస్ మరియు రిజల్ట్స్ పై అఫీషియల్ కంప్లైంట్ దాఖలు!

ఇక జరిగేది బోర్డుకు అలవాటైన బధిర శంఖారావమా? దెబ్బతిన్న పులుల సమైఖ్య వేటా??

admin by admin
June 3, 2021
in TANA Elections
0
TANA
0
SHARES
1.1k
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

గత ఆరు నెలలుగా క్షణక్షణం మారుతున్న అనేక పరిణామాలతో ఆసక్తికరంగా జరిగిన ప్రస్తుత ‘తానా’ ఎన్నికల ఓట్ల కౌంటింగులో కొద్ది తేడాలో నరేన్ కొడాలి వర్గం ఓడిపోయినట్లు ప్రకటించటం తెలిసిందే. అయితే ‘నమస్తే ఆంధ్ర’ గత కొన్ని నెలలుగా చెపుతున్నట్లే “ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ??” అనే విధంగా ఫలితాలు స్పష్టంగా ప్రకటించిన 48 గంటల లోపు(ఎలక్షన్ నిబంధన పరిధిలోనే) ఓడిపోయిన అభ్యర్థులందరూ మూకుమ్మడిగా ‘తానా’ బోర్డుకు, ఎలక్షన్ కమిటీకు అనేక విషయాలపై అభ్యంతరాలు తెలియజేస్తూ బోర్డు అత్యవసరంగా సమావేశమై ఎన్నికల ఫలితాలను నిలిపివేసి సమస్యలను కూలంకషంగా చర్చించి పరిష్కరించ వలసినదిగా నిబంధనల మేరకు సవివరంగా కంప్లైంట్ దాఖలు చేయడం జరిగింది.

వీటిలో ముఖ్యంగా ‘తానా’ జీవిత సభ్యుల డేటా అవకతవకలు, అడ్రస్ చేంజ్ విషయంలో జరిగిన అనేక అనుమానాస్పద నిర్ణయాలు, ఓటర్ల లిస్టుల మధ్యన వివిధ సమయాల్లో బయటపడిన అనేక వైరుధ్యాలు, ఈ వైరుధ్యాల మూలంగా జరిగిన అనేక ఇబ్బందులు, ముఖ్యంగా నామినేషన్లు కూడా తిరస్కారం జరగడం, ఓటర్ల అడ్రస్ మార్పులపై ప్రస్తుత కార్యవర్గ సభ్యులపై ఉన్న ఆరోపణలు, సభ్యులకు ఎటువంటి క్లియర్ కమ్యూనికేషన్ గాని లాగిన్ ఫెసిలిటీ గాని పనిచేయకపోవడం, అడ్రస్ మార్పుల లాగ్ ఫైల్ ను బయలు పరచక పోవడము, ఎన్నికల షెడ్యూల్స్ ను అనేకసార్లు సరైన పద్ధతి విధానం లేకుండా మార్పులు చేయడాలు, ఓటర్ల లిస్టు ఫైనల్ అయిన తర్వాత కూడా మార్పులు జరగడాలు, కొన్ని విషయాలపై సమస్యలను పరిశీలించటానికి వేసిన కమిటీలు ఎటువంటి దిద్దుబాటు చర్యలు చెయ్యలేక పోవడం, ఎలక్షన్ కమిషన్ సభ్యులతో గాని, అభ్యర్థులతో గాని, వెబ్సైటులో గాని, సరిగా ఎప్పటికప్పుడు మార్పు చేర్పులను వివరించకపోవడం, షెడ్యూల్స్ ఎన్నిమారినా  బాలట్లు తిరిగి చేరే తేదీని కదపకపోవడం, నియమించిన థర్డ్ పార్టీ వారు సరియైన విధముగా ప్రవర్తిచలేక పోవడం, రెండు సార్లు బాలట్లు ముద్రించడం, గంపగుత్తగా వచ్చిన బాలట్లను నిరాకరించకపోవడం, లెక్కించే యంత్రం సరిగా పనిచేయకపోవడం, ఎప్పటికప్పుడు కాక, ఫలితం మొత్తం చివరిలోనే ప్రకటించటం, అభ్యర్థుల ప్రశ్నలకు సరియైన సమాధానం ఇవ్వ లేకపోవడం వంటి అనేక ముఖ్య విషయాలను కంప్లైంటు లో ఉటంకిస్తూ పంపడంతో ఒక్కసారిగా అమెరికా తెలుగు కమ్యూనిటీ లో మళ్లీ సంచలనం మొదలైయ్యింది.

ఇప్పుడు ఏమి జరగబోతుంది అనేదానిపై అనేక ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి. నిరంజన్ ప్యానెల్ గెలిచిన ఆనందంలో సెలబ్రేషన్ ఏర్పాట్లు ఒక పక్క జరుగుతుండగా, ఓడిన నరేన్ వర్గానిది స్వల్ప తేడా అవ్వడం మూలాన మరియు అనేక అనుమానాస్పద విషయాలపై క్రితంలోలాగా మెత్తగా ఉండటం కాకుండా గట్టిగా పోరాడాలని నిశ్చయించుకోవడం తో తెలుగు సమాజంలో మళ్ళీ ఘర్షణ మొదలైనట్లే అని అనేకమంది భావిస్తున్నారు. అలాగే ‘తానా’ లో సభ్యుల డేటాబేస్ లో ఖచ్చితంగా పెద్ద సంఖ్యలో ఉండే అక్రమ డూప్లికేట్లు, దొంగ యుటిలిటీ బిల్లులతో ఒకే అడ్రసుకు అనేక ఓటర్ల అడ్రస్ మార్పు ప్రయత్నాలు, అక్రమ బాలట్ కలెక్షన్లు, ‘తానా’ బోర్డు  అనేక సందర్భాలలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు పై ఎవ్వరికీ భిన్నాభిప్రాయాలు లేక పోవడం తో సరైన పద్ధతిలో పోరాడితే విచిత్రమైన మలుపులతో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు జరగవచ్చు. ఏదో విధంగా ఇప్పటికైనా అందరూ ఆశించే మార్పులు ఈ విధంగానైనా సంభవించి ‘తానా’ సంస్థ మెరుగు పడే అవకాశాలుంటాయేమో చూద్దాము.

Tags: tatana elections results fraud cases filed
Previous Post

Photos: రష్మిక… క్లాస్ టీచర్ లుక్ !

Next Post

జగన్ ఆ పని చేయగలరా?.. డౌటే !!

Related Posts

Andhra

ఉద్యోగులకు షాక్…కొత్త పీఆర్సీ రిలీజ్ చేసిన జగన్

February 20, 2022
NRI

‘తానా’ కార్యవర్గాల ముఖ్య పదవుల ఎన్నికలు పూర్తి

August 11, 2021
TANA Elections

‘తానా’ కమ్యూనిటీ సర్వీసెస్ కో ఆర్డినేటర్ గా ‘రాజా కసుకుర్తి’ గెలుపు

June 3, 2021
TANA Elections

‘తానా’ జాయింట్ సెక్ర‌ట‌రీగా తెలుగు తేజం ‘తాళ్లూరి’

June 2, 2021
TANA Elections

‘తానా’ ఎన్నికలలో ‘నిరంజన్ ప్యానల్’ ఘన విజయం 

May 31, 2021
TANA Elections

‘తానా’ ఎలెక్షన్లలో బాలట్ ‘కలెక్షన్ కింగ్’ ఎవరో తేలేది నేడే

May 29, 2021
Load More
Next Post

జగన్ ఆ పని చేయగలరా?.. డౌటే !!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • అల్లూరి వేడుక శ్రీ‌కాకుళం మ‌రింత ప్ర‌త్యేకం
  • పేరు మార్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరో?
  • బ్రేకింగ్:రఘురామపై మరో కేసు
  • 37 నెలల్లో జగన్ చేసిందేంటో చెప్పిన దేవినేని ఉమ
  • ‘ఆర్ఆర్ఆర్’ గే మూవీ అంటోన్న ఆస్కార్ గ్రహీత
  • నెక్స్ట్ రఘురామ ఏపీలో అడుగుపెట్టేది అప్పుడేనట
  • చంద్రబాబును నమ్ముకుంటే ఆత్మహత్యలే..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
  • పిల్లల్ని కనని వాళ్లకి అవార్డు ఇస్తా
  • కావాలోయ్ ! మెగా ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు !
  • శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్ర‌యంలో సీజేఐ జ‌స్టిస్ ర‌మ‌ణ దంప‌తుల‌కు ఘ‌న వీడ్కోలు
  • ఆ రెండింట్లోంచి పవిత్ర లోకేష్ అవుట్
  • యథా రాజా.. తథా పోలీసు!
  • ఆ హిందువుల ఊచకోతపై సాయి పల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు
  • జగన్ గుడ్డోడు…లోకేశ్ అంత మాటెందుకున్నారంటే…
  • అయినోళ్లే ముంచేస్తాండారు అప్పుడూ..ఇప్పుడూ !

Most Read

ఆ రెండింట్లోంచి పవిత్ర లోకేష్ అవుట్

యథా రాజా.. తథా పోలీసు!

కావాలోయ్ ! మెగా ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు !

చంద్రబాబును నమ్ముకుంటే ఆత్మహత్యలే..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

జ‌గ‌న్‌పై సెటైర్లు…ఎవరికైనా చూపించడ్రా…అలా వదిలేయకండి…

అయినోళ్లే ముంచేస్తాండారు అప్పుడూ..ఇప్పుడూ !

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra