ప్రముఖ సినీనటి కంగనా రనౌత్ ను మహారాష్ట్రపభుత్వం ఇప్పట్లో వదిలిపెట్టేట్లు లేదు. కోర్టు ఆదేశాలతో కంగనా సిస్టర్స్ పై ముంబాయ్ పోలీసులు ఏకంగా దేశద్రోహం కేసు నమోదు చేయటం సంచలనంగా మారింది. అక్కా చెల్లెళ్ళిద్దరూ తమ ట్వీట్లు, ప్రకటనలతో సమాజంలో అశాంతిని పెంచేస్తున్నట్లు బాలివుడ్ కాస్టింగ్ డైరెక్టర్, పిట్ నెస్ ట్రైనర్ మునావర్ ఆలీ సయ్యద్ద కోర్టులో ఓ కేసు వేశారు. దాన్ని పరిశీలించిన న్యాయస్ధానం అక్కా, చెల్లెళ్ళపై వెంటనే విచారణ జరపి కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దాంతో పోలీసులు వెంటనే ఇద్దరిపైనా దేశద్రోహం కేసు నమోదు చేసేశారు.
కొంతకాలంగా మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగనా సోదరీమణులు విపరీతమైన ఆరోపణలు, విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. మామూలుగానే ముంబాయ్ లో శివససేన రాజకీయంగా చాలా బలమైన ఫోర్స్. అలాంటిది ఇపుడు ఏకంగా అధికారంలోనే ఉంది. కాబట్టి చాలామంది ప్రభుత్వంపై జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. అయితే కంగనా సిస్టర్స్ అలాంటిదేమీ పట్టించుకున్నట్లు లేదు. అందుకనే నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. శివసేన ప్రముఖుడు, ఎంపి సంజయ్ రౌత్ తో మొదలైన గొడవలు చివకు ప్రభుత్వంతో వివాదంగా మారిపోయింది. అందుకనే ఆమధ్య కంగనా ఆఫీసును కూడా ముంబాయ్ కార్పొరేషన్ వాళ్ళు కూల్చేశారు. అయితే కోర్టు ఆర్డర్ తో కూల్చివేతలు ఆగిపోయాయి.
ముంబాయ్ ను కంగనా ఆమధ్య పాక్ ఆక్రమిత కాశ్మీర్ అన్న పద్దతిలో పోల్చారు. దాంతో మంటలు భగ్గుమన్నాయి. దానికి తోడు ప్రతి విషయంలోను కంగనా సిస్టర్స్ అందరితోను గొడవలు పెట్టుకోవటం కూడా ఎక్కువైపోయాయి. బోల్డుగా మాట్లాడుతాను అనే ముసుగులో ఎవరిపైన పడితే వాళ్ళపైన కంగనా సిస్టర్స్ కు నోరుపారేసుకుంటున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ట్విటర్లో, ఇంటర్వ్యూల్లో, ఫేస్ బుక్ లాంటి మీడియా వేదికలపై అవసరమైనవి, అనవసరమైనవి అన్న తేడా లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం వల్లే చిక్కులు వస్తున్నాయని బాలీవుడ్ ప్రముఖులు ఈ సిస్టర్స్ గురించి వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తానికి తమపై దేశద్రోహం కేసులు పెట్టటంపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.