పీజీ విద్యకు ఫీజు రీఎంబర్స్ మెంట్ రద్దు చేసి ఏపీ ప్రభుత్వం సంచలన జీవో ఇచ్చింది. అంటే ఇక డిగ్రీ లేదా బీటెక్ వరకు మాత్రమే ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇస్తారు. ఆపై ఇవ్వరు. సొంత డబ్బులతో చదవాల్సిందే. ఇకపై ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ చదవాలంటే సొంతంగా ఫీజులు కట్టి చదవాలన్నమాట.
ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోపై విద్యార్థి లోకం మండిపడుతోంది. జగన్ రాగానే మేము సంపన్నులం అయిపోయామా? ఇంతకుముందు విదేశీ విద్య, పీజీ విద్య అన్నీ ఫ్రీయే. కానీ ఇపుడు వాటికి ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇవ్వడం కుదరదు అని జీవో జారీ చేయడం సంచలనం అవుతోంది. జగన్ నిర్ణయంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. జగన్ కి ఓటేస్తే చంద్రబాబు కంటే ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాడు అనుకుంటే అన్నీ కోతలే అంటున్నారు.
దీనిపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీ పిల్లలకు మాత్రమే ఫారెన్ చదువులా?బడుగు,బలహీన వర్గాల యువత విదేశాల్లో చదువుకోవడానికి అర్హులు కారా @ysjagan గారు? ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేసారు.ఎన్నికల ముందు కూతలు అధికారం వచ్చాకా కోతలు. ఇప్పుడు ఏకంగా ప్రైవేట్ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసింది వైకాపా ప్రభుత్వం.ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాను.విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం మంచిది కాదు జగన్ రెడ్డి గారు. ప్రైవేట్ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన జీఓని వెనక్కి తీసుకోవాలి.ప్రైవేట్ కాలేజీల్లో చదివే పీజీ చదివే విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చెయ్యాలి.’’ అని లోకేష్ ట్వీట్ చేశారు.
గత డిసెంబరులో గొప్పలు చెబుతూ పబ్లిసిటీ చేసుకున్న జగన్ పత్రిక.. ఇపుడు ఇదంతా ఒక కలగా మిగలనుంది