పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ కళ్లు చెదిరే రేంజ్లో ఉన్నప్పటికీ అభిమానులు మాత్రం తీవ్ర గందరగోళంలో పడిపోయారు. గత ఏడాది `కల్కి 2898 ఏ.డీ` చిత్రంతో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన ప్రభాస్.. ఈ ఏడాది `ది రాజా సాబ్` సినిమాతో ప్రేక్షకులను పలకరించాల్సి ఉంది. ప్రభాస్ కెరీర్లోనే తొలి హారర్ మూవీ ఇది. మారుతి డైరెక్టర్ కాగా.. టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. మొదట రాజా సాబ్ ను 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ ఈ ఇయర్ ఎండ్ కు విడుదల అయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు.
షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండటంతో వచ్చే ఏడాది సంక్రాంతికి రాజా సాబ్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. మరోవైపు ప్రభాస్ చేతిలో `సలార్ 2`, `కల్కి 2` చిత్రాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయనున్న సలార్ 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నారు. కానీ, సలార్ పార్ట్ 1 విడుదలై ఏడాది గడిచినా.. రెండో భాగానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు. కల్కి 2 విషయానికి వస్తే.. డైరెక్టర్ నాగ అశ్విన్ స్క్రిప్ట్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ `ఫౌజీ` మూవీ చేస్తున్నాడు. సోషల్ మీడియా స్టార్ ఇమాన్వీ ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక అయింది. యుద్ధ నేపథ్యంతో పాటు, భావోద్వేగాలు కలబోసిన కథతో ఫౌజీ రూపుదిద్దుకుంటోంది. కొద్ది రోజుల క్రితమే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లింది. ఇక వీటితో పాటే స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో `స్పిరిట్` అనే మూవీ చేసేందుకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కాప్ డ్రామా నేపథ్యంలో స్పిరిట్ ఉండబోతుందని ఇప్పటికే నిర్మాత భూషణ్ కుమార్ వెల్లడించాడు. కానీ ఇంకా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు. ప్రభాస్ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్లు ఉన్నప్పటికీ.. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఏది ముందు? ఏది వెనుక? అన్నది అర్థంగాక ప్రభాస్ ఫ్యాన్స్ తెగ కన్ఫ్యూజ్ అవుతున్నారు.