తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో దొంగ ఓటర్ల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. వాస్తవానికి ఏ ఓటరుకైనా.. తనకు ఎన్నికలసంఘం ఇచ్చిన ఓటరు పత్రంలోను, లేదా.. ఓటరు కార్డులోను సంబంధిత ఓటరు వివరాలు స్పష్టంగా ఉంటాయి. ఒటరు ఇంటి పేరు, తండ్రి పేరు.. చిరునామా.. సంపూర్ణంగా ఉంటాయి. సో.. నిజమైన ఓటరు అయితే.. ఖచ్చితంగా అందులోని వివరాలను చెప్తారు. కానీ, తిరుపతిలో ని పోలింగ్ బూత్‌లలోకి వస్తున్నవారిలో చాలా మంది తమ పేరు చెబుతున్నా.. ఓటరు కార్డులోని వివరాల ను మాత్రం వెల్లడించక పోవడం గమనార్హం.
ఈ పరిస్థితి చాలా బూత్‌లలో చోటు చేసుకుంది. అయితే.. ఉదయాన్నే ఎంతో మంది ఓటర్లు ఇలా దొంగ ఓట్లు వేశారనేది ప్రతిపక్షాల ఆరోపణ. ఇదిలావుంటే.. తాజాగా వెలుగు చూసిన.. ఓ ఫోన్ రికార్డింగ్.. స్పష్టంగా వీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అనే విషయాన్ని స్పష్టం చేయడం గమనార్హం. దొంగ ఓటర్లంతా కూడా మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గం నుంచి తరలి వ చ్చినట్టు సదరు ఫోన్ కాల్లో ఉండడం గమనార్హం. అదేసమయంలో ముందుగా పక్కా ప్లాన్‌తోనే పలమనే రు, పుంగనూరు నియోజకవర్గాల నుంచి వైసీపీ సానుభూతిపరులను తిరుపతికి తరలించారు.
వాస్తవానికి తిరుపతి పార్లమెంటు పరిధిలోని సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసులు.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను, మనుషులను కూడా నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ.. కీలక నేతలే చక్రం తిప్పడంతో దొంగ ఓటర్లకు చెందిన బస్సులు పదుల సంఖ్యలో తిరుపతికి చేరుకున్నా యి. దీంతో ఉదయం నుంచి 10 గంటల మధ్య భారీ ఎత్తున నకిలీ ఓటర్లు.. ఓట్లు వేశారని టీడీపీ నాయకు లు, బీజేపీ అభ్యర్థి కూడా ఆరోపించారు.. అంతేకాదు.. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిలు.. కూడా..దొంగ ఓటర్లను పట్టుకోవడం గమనార్హం. అయినప్పటికీ.. పోలీసులు వారిని మందలించి వదిలి పెట్టేశారు. మొత్తానికి తిరుపతి ఉప పోరులో పుంగనూరు, పలమనేరు బ్యాచ్ హవా ఎక్కువగా ఉందని అంటున్నారు పరిశీలకులు.