ఇటీవల విశాఖలో ముగిసిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అని, దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ పారిశ్రామికవేత్తలు విశాఖకు క్యూ కట్టారని జగన్ అండ్ కో గొప్పలు చెప్పుకుంటోన్న సంగతి తెలిసిందే. భారత దేశ అపర కుబేరుడు అంబానీ మొదలు అంతర్జాతీయ స్థాయిలో టెస్లా సహ వ్యవస్థాపకుడు మార్టిన్ వరకు అంతా విశాఖకు వచ్చి ఏపీలో పెట్టుబడులను పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారని వైసీపీ మీడియా, సోషల్ మీడియా గొప్పలు చెప్పుకుంటోంది.
తాను టెస్లా సహ వ్యవస్థాపకుడినని, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ చాలా బాగుందని స్వయంగా మార్టిన్ చెప్పినట్టుగా సీఎంఓ ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ట్వీట్ చేయడం ఈ మొత్తం ఎపిసోడ్ కొస మెరుపు. ఇదంతా చూడగానే జగనన్న టెస్లా కంపెనీకి కూడా ఏపీకి తెచ్చాడు అన్న ఫీలింగ్ వైసీపీ అభిమానులకు కలగడం సహజం. కానీ, కాస్త నెమ్మదిగా వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే అసలు విషయం బోధపడుతుంది.
ఎందుకంటే, టెస్లాను దివాలా తీసే రేంజ్ కు తీసుకువచ్చిన ఘనత మార్టిన్ దని టెస్లా బోర్డ్ అఫ్ డైరెక్టర్స్ నిర్ణయించి ఆయనను పీకేసింది. ఈ మార్టిన్ అనే వ్యక్తి మీద 2007లో కోర్టుకు కూడా వెళ్లింది. ఇక, అపర మేధావిగా పేరు ఉన్న టెస్లా వ్యవస్థాపకుడు ఎలా మస్క్ కూడా మార్టిన్ పై 2021లో సంచల వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో కలిసిన చెత్త వ్యక్తి మార్టిన్ అని, అసలు తాను మార్టిన్ ని కలిసి ఉండకపోతే బాగుండేదని స్వయంగా అభిప్రాయపడ్డారు.
తాను వేలాది మందితో పనిచేశానని, కానీ తన కెరీర్లో చూసిన అత్యంత చెత్త వ్యక్తి ఉద్యోగి మార్టిన్ అని మస్క్ స్వయంగా షాకింగ్ కామెంట్ చేశారు. మార్టిన్ మొఖం మళ్ళీ చూసేందుకు తాను ఇష్టపడనని మస్క్ దుమ్మెత్తిపోశాడు. ఇటువంటి మార్టిన్ ను పట్టుకొచ్చిన జగన్ ఆయనకు శాలువా కప్పి సెల్ఫీ దిగి టెస్లా కంపెనీని ఏపీకి తెచ్చినంత బిల్డప్ ఇవ్వడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. ఫేక్ జగన్, ఫేక్ ఐపాక్, ఫేక్ వైసీపీ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది.