జగన్ ఒక్క మంత్రికీ అప్పాయింట్మెంట్ ఇవ్వరని, సజ్జలతోనే మాట్లాడి, సజ్జలతోనే మాట్లాడిస్తాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రకమైన వెధవ బతుకులు, పదవులు ఎందుకని… కొంచెం గౌరవం పెంచుకోండని మంత్రులనుద్దేశించి హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి జగన్ పై హర్ష కుమార్ మండిపడ్డారు.
దళితులకు మేలు చేస్తాడనుకున్న జగన్..వారిని చంపేస్తున్నాడని హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై, జగన్ను భరించడం తమ వల్ల కాదని, ఎంతకాలమని కొట్టించుకుంటామని షాకింగ్ కామెంట్లు చేశారు. ఎంతకాలమని ఈ అన్యాయాన్ని భరించాలని ప్రశ్నించారు. జగన్ హయాంలో దళితుల గొంతులను అణచివేస్తున్నారని, వారినే టార్గెట్ చేసి చంపేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు.
ఏపీలో వైసీపీ దమనకాండ దారుణంగా పెరిగిపోయిందని, డాక్టర్ సుధాకర్ మొదలు సామర్లకోటలో ఆవుల గిరీశ్ బాబు వరకు దళితులను హింసించి చంపారని ఆరోపించారు. పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న గిరీశ్ విషయంలోనూ జగన్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. మరోవైపు, ఆ వ్యవహారంలో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం సీఐ కేఎన్వీ జయకుమార్, సామర్లకోట ఎస్సై బి.అభిమన్యుడును ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడం తెలిసిందే.