ఏపీ అధికార పార్టీ వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు వీడడం లేదు. ప్రతి రోజూ ఏదో ఒక చోట ఏదో ఒక వివాదం తెరమీదికి వ స్తూనే ఉంది.వీటిలో కొన్ని చిన్నచిన్నవికాగా.. ఇప్పుడు పెద్ద సమస్యే పార్టీలో అలుముకుంది. వైసీపీ కీలక నాయకుడు.. సాక్షా త్తూ సీఎం జగన్‌కు దూరపు బంధువు, మాజీ మంత్రి కూడా అయిన బాలినేనికి తాజాగా అవమానం జరిగిందని స్వ యంగా ఆయనే ప్రకటించుకున్నారు. అంతేకాదు.. దీనివెనుక `ఎంత స్థాయి పెద్ద`లు ఉన్నా.. వదిలి పెట్టబోనని కూడా సంచలన ప్రకటన చేశారు.
దీంతో వైసీపీలో ఈ పరిణామం.. మరింత సెగలు పుట్టిస్తోంది. బాలినేని ప్రకటన తర్వాత.. అసలు ఏం జరిగిందనే చర్చ కూడా తెరమీదికి వచ్చింది. ఇటీవల `ఈబీసీ నేస్తం` అనే బటన్ నొక్కుడు కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఇది.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి బాలినేనిని కూడా ఆహ్వానించారు. దీంతో బాలినేని వీవీఐపీ కాన్వాయ్లోఅక్కడకు వెళ్తున్న క్రమంలో స్థానిక సీఐ ఒకరు ఈయనను అడ్డగించి.. లోపలికి వెళ్లనివ్వలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాలినేని.. సదరు సీఐతో వాగ్వాదానికి దిగారు.
ఈ వాగ్వాదం జరుగుతున్న సమయంలోనే.. ఇదే జిల్లాకుచెందిన మంత్రి ఆదిమూలపు సురేష్‌ను పోలీసులు లోపలికి అనుమ తించారు. ఇప్పటికే బాలినేని వర్సెస్ ఆదిమూలపు మధ్య రాజకీయ యుద్ధం అంతర్గతంగా సాగుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది జరిగిన మంత్రి వర్గ ప్రక్షాళనలో తనను మంత్రి పదవి నుంచి తీసేయడాన్ని ప్రశ్నించిన బాలినేని.. అదేసమయంలో ఆదిమూలపు సురేష్‌కు మరోసారి మంత్రి పదవి ఇవ్వాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో వీరి మధ్య విభేదాలు తారస్తాయి కి చేరాయి. మాటలు కూడాలేవని అంటారు.
ఇలాంటి సమయంలో సీఎం జగన్ పాల్గొన్న కార్యక్రమానికి బాలినేనిని వెళ్లకుండా అడ్డుకుని మంత్రి సురేష్‌ను అనుమతించ డం.. బాలినేనికి మరింత ఆగ్రహం తెప్పించింది. దీంతో ఈ విషయాన్ని తాను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఇదిలావుంటే.. బాలినే ని వర్గం మరోసంచలన విషయాన్ని వెల్లడించింది. బాలినేనిని అడ్డుకోవడం.. సురేష్‌ను ప్రోత్సహించడం వెనుక తాడేపల్లిలో చక్రం తిప్పుతున్న కీలక సలహాదారు ఒకరు ఉన్నారని వెల్లడించడం గమనార్హం. దీంతో ఇప్పుడు ఈ పోరు.. తాడేపల్లికి చేరే అవకాశం కనిపిస్తోంది. ఏదేమైనా.. బాలినేని పరిస్థితి ఇప్పుడు ఒకింత ఇబ్బందిగానే ఉందని అంటున్నారు పరిశీలకులు.