మాజీ మంత్రి, వైసీపీ నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు మండిపడుతోన్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ లపై కొడాలి నాని అసభ్యకర పదజాలంతో, అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదుల చేస్తున్నారు టీడీపీ నేతలు.
ఈ క్రమంలోనే కొడాలి నానిపై ఫిర్యాదు చేయడానికి గుడివాడ బయలుదేరిన టీడీపీ నేతలను పామర్రు టీడీపీ ఇన్ చార్జి ఇంటి వద్ద పోలీసులు అరెస్టు చేయడం సంచలనం రేపింది. అంతేకాుద, వారందరినీ పలు పోలీస్ స్టేషన్లకు తరలించడం చర్చనీయాంశమైంది. కోట్లాది మంది టీడీపీ కార్యకర్తల మనోభావాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన కొడాలి నానిపై సుమోటోగా కేసు పెట్టాల్సింది పోయి, టీడీపీ నేతలు, కార్యకర్తలను అడ్డుకోవడం పోలీసుల బానిసత్వమేనని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా కొడాలి నానికి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇట్టాగే వాగుతుంటే తగిన బుద్ధి చెబుతామంటూ అమర్నాథ్ రెడ్డి హెచ్చరించారు. ప్రజలు కొడాలి నానిని గెలిపించింది నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికంటూ నానికి చురకలంటించారు. బూతులతో టీడీపీ నాయకులపై దాడి చేయడానికి ఆయనను గెలిపించలేదని గుర్తు చేశారు.
తన ఇంటి ముందు రోడ్డు కూడా వేయించుకోలేని సన్నాసి వెధవ కొడాలి నాని అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీపైనా, చంద్రబాబు కుటుంబంపైనా బూతులతో విమర్శలు గుప్పిస్తే తగిన బుద్ధి చెబుతామని అమర్నాథ్ రెడ్డి హెచ్చరించారు. అనంత బాబు, గోరంట్ల మాధవ్, కొడాలి నాని. ఇలా అధికార పార్టీకి చెందిన వారైతే చాలని, వారి మీద పోలీసులు ఫిర్యాదులు కూడా స్వీకరించట్లేదని ఆయన ఆరోపించారు. పోలీసుల తీరుపై ఆయన మండిపడ్డారు.
Comments 1