తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో స్థాపించిన తెలుగు దేశం పార్టీకి ప్రపంచవ్యాప్తంగా చాలామంది తెలుగువారి మద్దతు ఉందన్న సంగతి తెలిసిందే. అమెరికాలో టీడీపీ నిర్వహించే కార్యక్రమాలతో పాటు ఏపీ, తెలంగాణలో నిర్వహించే కార్యక్రమాలకూ సహాయసహకారాలందిస్తుంటారు. అటువంటి ఎన్నారైల సేవలను టీడీపీ అధిష్టానం గుర్తించి వారికి సముచిత గౌరవం ఇస్తోంది.
ఈ క్రమంలోనే అమెరికాలో స్థిరపడి, కొద్ది సంవత్సరాల క్రితం స్వదేశానికి తిరిగివచ్చిన గుంటూరుకు చెందిన ఎన్నారై బుచ్చి రాంప్రసాద్ కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కీలక పదవి అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్ లో స్థిరపడిన తర్వాత టీడీపీలో మరింత కీలకంగా, క్రియాశీలకంగా ఆయన వ్యవహరిస్తున్నారు. గుంటూరు కేంద్రంగా రాజకీయాల్లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. అమరావతి ఉద్యమంలోను క్రియాశీలకంగా పాల్గొంటున్నారు.
టీడీపీలో కీలక పదవిలో నియమితులైన రాంప్రసాద్ కు అమెరికాకు చెందిన ఎన్నారైలు తానా మాజీ అధ్యక్షులు జయరాం కోమటి, గంగాధర్ నాదెళ్ల, సతీష్ వేమన మరియు ప్రస్తుత అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి, ఇంగ్లాండ్ కు చెందిన డాక్టర్ నిరంజన్ మోటూరి ,ఐర్లాండ్ కు చెందిన కిషోర్, కువైట్ కు చెందిన నాగేంద్రబాబు, సుధాకర్ కుదరవల్లి, వెంకట్ కోడూరి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
తనను కీలక పదవిలో నియమించిన చంద్రబాబుకు, లోకేష్ బాబుకు మరియు ఎన్నారైలకు బుచ్చి రాంప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. పార్టీకి ఎల్లపుడూ తన వంతు సహాయ సహకారాలందించానని, తన శక్తిమేరకు పార్టీ ఉన్నతికి కృషిచేస్తానని రాంప్రసాద్ అన్నారు.