అమరావతి
విజయవాడ చరిత్రలోనే ఇది పెద్ద ఉద్యమం…. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కదం తొక్కిన ఉద్యోగులు… ప్రభుత్వ ఆంక్షలు సైతం లెక్కచేయని….. ఉద్యోగులతో కిక్కిరిసిన బెజవాడ…. pic.twitter.com/AwdC8CjVas
— Katam Gangadhar కాటం గంగాధర్ (@KatamGangadhar) February 3, 2022
ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు….ఎలాగైనా కార్యక్రమం విజయవంతం చేస్తామని ఉద్యోగులు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలోనే బెజవాడకు ఉద్యోగులంతా వేలాదిగా తరలిరావడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే కొందరు ఉద్యోగులు జగన్ పై, సజ్జలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
తమ ఆవేదన సామాన్య ప్రజలకు తెలియాలని, అందుకే ఈ విమర్శలు చేస్తున్నామని మహిళా ఉద్యోగి ఒకరు తీవ్ర ఆవేదన వెళ్లగక్కారు. తమకు రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్న డీఏ బాకీలు ఇచ్చి జీతం పెరిగిందని చెబుతున్నారని ఆమె మండిపడ్డారు. తాము ఉన్నత చదువులు చదువుకొని ఉపాధ్యాయులుగా, ఉద్యోగులుగా పాతికేళ్లుగా ఉద్యోగం చేస్తున్నామని…తమకు లెక్కలు రావా అని ఆమె నిలదీస్తున్నారు. సజ్జలతో చర్చలు జరిపినందుకు పశ్చాత్తాప పడుతున్నామని అన్నారు. తమతో చర్చలు జరిపేందుకు సజ్జల ఎవరని వారు ప్రశ్నిస్తున్నారు.తమతో చర్చలు జరపడానికి…సీఎం గారు ముందుకు రావాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
సజ్జల వంటి వారి వ్యాఖ్యల వల్లే ఈ మహాసభ జరపాలని ఉద్యోగులు భావించారని, ఉద్యోగుల ఉద్యమానికి సజ్జల కామెంట్లే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎటువంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో లేని సజ్జల వ్యాఖ్యలు, లెక్కల వల్లే ఉద్యోగులు ఇంతదూరం వచ్చారని టాక్ వస్తోంది. సజ్జల వల్లే ఉద్యమం జరిగిందని అంటున్నారు.
చంద్రబాబు ఇచ్చిన పీఆర్సీ నెత్తిమీద జుట్టులా ఉందని, జగన్ ఇచ్చిన పీఆర్సీ బోడిగుండులా ఉందని ఉద్యోగి ఒకరు సెటైర్లు పేల్చారు. తాడేపల్లి హౌస్ లో ఉండే జగన్….సకల శాఖా మంత్రి సజ్జల ద్వారా చెప్పిస్తున్నారని, జగన్ తమతో చర్చించాలని అంటున్నారు. ఫిట్ మెంట్ కోసి, డీఏ ఎరియర్స్ కలిపి, హెచ్ ఆర్ ఏ కోసి జీతం పెరిగిందని చెబుతున్నారని మండిపడ్డారు. సీఎంగారు కావాలంటే…చార్టెర్డ్ అకౌంటెంట్ ద్వారా లెక్కలు వేయించుకొని చూడాలని, అప్పుడు తమ జీతం పెరిగిందో లేదో తెలుస్తుందని అంటున్నారు.