ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పరుచూరు నియోజకవర్గంలో ఈ సారి కూడా టీడీపీదే గెలుపా? ఇక్కడ నుంచి మూడో సారి ముచ్చటగా బరిలో నిలిచిన ఏలూరి సాంబశివరావుదే ఈ సారి కూడా విజయమా? అంటే.. అవుననే అంటున్నారు పరిశీలకులు. కేవలం ఒక్క విజయమే కాదని.. ఈ సారి హ్యాట్రిక్ సొంతం చేసుకోవడం ఖాయమన్న చర్చలు ఎన్నికలకు నెలరోజుల ముందే మొదలైపోయాయి. దీనికి ప్రధానంగా మూడు కారణాలు చెబుతున్నారు. 1) బలమైన నేపథ్యం. 2) వ్యూహాత్మక ఎత్తుగడ. 3) ఈక్వేషన్లు. ఈ మూడు అంశాలతో ఏలూరి దూసుకుపోతున్నారని చెబుతున్నారు.
1) బలమైన నేపథ్యం: ప్రజలు కోరుకునేది బలమైన నాయకుడు. పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే. తమకు బలంగా నిలబడి సేవలు చేసేవారిని కోరుకుంటారు. అది ఏ నియోజకవర్గమైనా ఒకటే. ఈ విష యంలో ఏలూరి సాంబశివరావుకు.. మెజారిటీ ప్రజల దన్ను కనిపిస్తోంది. దీనికి కారణం.. ఆయన గత పదేళ్లుగా ప్రజలతోనే కలిసి ఉంటున్నారు. ఎక్కడా ప్రజలకు దూరంగా ఉండడమే లేదు. కరోనా సమయం నుంచి అకాల వర్షాల వరకు.. ఏ ఇబ్బంది వచ్చినా.. ఆయన నేనున్నానని చెబుతున్నారు.
2) వ్యూహాత్మక ఎత్తుగడ: రాజకీయంగా వ్యూహాత్మకంగా ఎత్తుగడలు వేయడంలో ఏలూరి సాంబశివరావు ముందున్నారు. ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్నవారిని.. తన చెంతకు చేర్చుకుంటున్నారు. అదేవిధంగా సామాజిక వర్గాల పరంగా అసంతృప్తితో ఉన్నవారిని కూడా.. ఆయన దరిచేర్చుకుని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. ఇది ఏలూరి బలాన్ని రెట్టింపు చేస్తోంది.
3) ఈక్వేషన్లు: రాజకీయాల్లో ఇది చాలా కీలకం. సొంత పార్టీలో అయినా.. పొరుగు పార్టీల్లో అయినా. ఈక్వేషన్లకు ప్రాధాన్యం ఇవ్వడం నాయకులు చేయాల్సిన ప్రథమ పని. ఈ దిశగానే ఏలూరి ముందుకు సాగుతున్నారు. సామాజికవర్గాల పరంగా ఈక్వేషన్లను ఆయన సరిచూసుకుంటున్నారు. ఎవరి విషయంలోనూ ఆయన చూసీచూడనట్టుగా వ్యవహరించడం లేదు. మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ ఇలా అన్ని ఈక్వేషన్లను ఆయన సరిచూసుకుని వారిని చెంతకు చేర్చుకుంటున్నారు. దీంతో ఏలూరి వ్యూహం ముందు.. వైసీపీ వ్యూహాలు చిత్తవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.