ఇటీవల కాలంలో చోటుచేసుకున్న పరిణామాలు ఆశ్చర్యకరంగానే కాదు.. షాకింగ్ గా ఉంటున్నాయి. ప్రపంచ కుబేరుడు ప్రపంచానికి పెద్దన్న అమెరికా అధ్యక్షుడితో రాసుకుపూసుకు తిరగటం.. పాలనలోనూ వేలు పెట్టే పని చేయటం.. అందుకు అధ్యక్షుల వారు ప్రోత్సహించటంలాంటివి ఒక ఎత్తు అయితే.. తాజాగా చోటు చేసుకున్న సీన్ మాత్రం వైట్ హౌస్ చరిత్రలో ఇప్పటివరకు జరగలేదేమో? అంతేకాదు.. ఈ సందర్భంగా తీసిన ఫోటో ప్రపంచ చరిత్రలో ఇస్పెషల్ గా మారుతుందని మాత్రం చెప్పక తప్పదు. అగ్రరాజ్యం అమెరికాలో అడుగు పెట్టటం ఒక సవాలుగా భావిస్తారు. అదంతా ఒక ఎత్తు అయితే.. ఎంత పెద్ద తోపు అయినా.. వైట్ హౌస్ కు వెళ్లే వేళలో వ్యవహరించే తీరు మొత్తం.. వైట్ హౌస్ సిబ్బందికి తగ్గట్లుగా ఉంటుంది. తాజాగా మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం కనిపించిందని చెప్పాలి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు మధ్య ఒక ఒప్పందం జరిగింది.
దీని సారాంశం.. ప్రభుత్వ ఉద్యోగులపై వేటు వేసే బాధ్యతను ఎలాన్ మస్క్ కు అప్పగించారు.ఫెడరల్ వర్క్ ఫోర్సును మరింత తగ్గించేందుకు వీలుగా మస్క్ చేతిలో ఉన్న ప్రభుత్వ సామర్థ్య శాఖకు అధికారాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రత్యేక ఉత్తర్వుపైన ట్రంప్ సంతకం చేశారు. ఇక్కడే ఒక ఆసక్తికర సీన్ చోటు చేసుకుంది. ఈ ఒప్పందం వేళ.. తన నాలుగేళ్ల కొడుకును తీసుకొని మరీ మస్క్ వెళ్లారు. ప్రపంచాన్ని శాసించే అమెరికా అధ్యక్షుడితో చేసుకునే డీల్ వేళ.. తన నాలుగేళ్ల కొడుకును పిక్నిక్ కు తీసుకెళ్లినట్లుగావైట్ హౌస్ కు తీసుకెళ్లినట్లుగా తీసుకెళ్లారు.
అంతేకాదు.. ట్రంప్ ఎదుట మన తాతలు ఎలా అయితే.. మనమళ్లను భుజానికి ఎత్తుకొని బజారుకు తీసుకెళతారో.. మస్క్ తన కొడుకును భుజాల మీద కూర్చోబెట్టుకొని మరీ ట్రంప్ ఆఫీసుకు వెళ్లి.. ఆయనతో డీల్ చేసుకున్నారు. సంతకాలుపెట్టే వేళలో మాత్రం తన నాలుగేళ్ల కొడుకును నేల మీదకు విడిచాడు.ఆ టైంలో ఆ పిల్లాడు ఆడుకోవటం కనిపిస్తుంది. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అనే అక్షరాలున్న టోపీని ధరించిన మస్క్ మాట్లడుతూ.. స్వయం ప్రతిపత్తి కలిగిన సమాఖ్య బ్యూరోక్రసీ లేదని.. అందుకే ప్రజల తరఫున ప్రతిస్పందించే వ్యక్తి అండగా ఉండాలన్నారు. అందుకే.. ప్రజల చేత ఎన్నిక కాని అధికారిగా తన పాత్రను మస్క్ సమర్థించుకోవటం గమనార్హం. వివిధ విభాగాల్లో ఉద్యోగుల్ని తగ్గించే అధికారాన్ని అధ్యక్షుడు తనకుమంజూరు చేశారన్న ఆయన.. బ్యూరోక్రసీలో లక్షల డాలర్ల జీతం కలిగిన సిబ్బంది ఉండటం వింతగా ఉందన్నారు. నిజమే.. ఒక పక్కా వ్యాపారవేత్తకు.. ప్రపంచానికే పెద్దన్న అయిన అమెరికా అధ్యక్షుడు తన ఉద్యోగుల్ని కోత పెట్టే కార్యక్రమం అప్పగించటం కూడా మహా వింత కాదా ఏంటి?