ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయని, జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత కీలక ప్రకటన రాబోతోందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ముందస్తు ఎన్నికలు వచ్చే చాన్స్ ఉందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా…టీడీపీ నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని హింట్ ఇస్తున్నారు. ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా జూన్ 14 నుంచి వారాహి యాత్ర మొదలుపెట్టబోతున్నారు. దీంతో, ఈ ఏడాది డిసెంబరులో తెలంగాణ సాధారణ ఎన్నికలతోపాటు ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలుంటాయని ఊహాగానాలు జోరందుకున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో ముందస్తు ఎన్నికలపై తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం షాకింగ్ న్యూస్ చెప్పింది. తాజాగా ప్రకటించిన 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ లో ఏపీ లేకపోవడంతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే చాన్స్ లేదని పరోక్షంగా తేల్చి చెప్పింది. త్వరలో జరగబోయే 5 రాష్ట్రాల ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 5 రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో బదిలీలు, పోస్టింగులపై జూలై 31వ తేదీ లోపు నివేదిక ఇవ్వాలని సీఈవోలకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది.
5 రాష్ట్రాల ఎన్నికల తేదీలు ఇవే:
మిజోరాం 17.12.23
చత్తీస్ గఢ్ 03.01.24
మధ్యప్రదేశ్ 06.01.24
రాజస్థాన్ 14.01.24
తెలంగాణ 16.01.24