తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నాయకుడు, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కాలే యాదయ్యపై సొంత పార్టీ కార్యకర్తలే కోడిగుడ్ల దాడులు చేశారు. నిజానికి సొంత నియోజకవర్గంలోకి ఎమ్మెల్యే అడుగు పెడుతున్నారంటే.. ఆయన అనుచరులు, పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతారు. వారికేమైనా సమస్యలు ఉంటే చెప్పుకొనే ప్రయ త్నం చేస్తారు. కానీ, ఇక్కడ అంతా రివర్స్ జరిగింది.
కాలే యాదయ్య.. బుధవారం సాయంత్రం తన నియోజకవర్గలోకి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కల్యా ణ్ లక్ష్మి పథకం లబ్ధి దారులకు చెక్కులు అందించాల్సి ఉంది. అయితే.. ఈ కార్యక్రమానికి స్థానిక కార్యక ర్తలు, అనుచరులు పెద్ద ఎత్తున వస్తారని.. వారి స్వాగత సత్కారాల మధ్య చెక్కులు పంపిణీ చేయాలని భావించారు. కానీ, యాదయ్యకు షాకిస్తూ.. కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. యాదయ్య కాన్వాయ్‌కు.. అడ్డు తగలడంతోపాటు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ క్రమంలో కార్యకర్తలు.. దూసుకువచ్చి యాదయ్య కారుపై విరుచుకుపడ్డారు. అంతేకాదు.. కొందరు యు వకులు పెద్ద ఎత్తున కోడిగుడ్లతో దాడికి దిగారు. ఈ పరిణామంతో యాదయ్య ఉలిక్కిపడ్డారు. పోలీసులు నిలువరించే ప్రయత్నం చేసినా.. కార్యకర్తలు, అనుచరులు శాంతించలేదు. ఇదిలావుంటే.. అసలు యాదయ్యపై ఇంత దాడికి దిగడానికి కారణం.. ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని.. సొంత అనుచరులమైన తమను ఏమాత్రం పట్టించుకోకపోవడమేనని తెలుస్తోంది.