తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఓడించేందుకు ఓ పక్క ఈటల రాజేందర్ మరోపక్క రేవంత్ రెడ్డి ఆయనపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గజ్వేల్ లో కేసీఆర్ పై ఈటల రాజేందర్ పోటీ చేస్తుండగా, కామారెడ్డిలో కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ఢీ కొంటున్నారు. ఈ క్రమంలోనే తాను గజ్వేల్ లో ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందో వివరిస్తూ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు,
తాను కేసీఆర్ బాధితుడినని, అందుకే ఆయనను ఢీ కొట్టేందుకే గజ్వేల్ లో పోటీ చేస్తున్నానని ఈటల అన్నారు. దిక్కు లేక గజ్వేల్ కు రాలేదని, తనకు అన్యాయం జరిగింది కాబట్టి ఆయనపై పోటీ చేస్తున్నానని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఒక్క ఓటమి కూడా లేదని, కేసీఆర్ లాగా తాను కూడా ఒక్కసారి ఓడిపోలేదని, అందుకే గజ్వేలో లో ఆయనపై పోటీ చేస్తున్నానని చెప్పారు. కేసీఆర్ ని గెలిపిస్తారా లేక ఈటలను గెలిపిస్తారా అనేది ప్రజల చేతిలో ఉందన్నారు.