తెలంగాణలో మునుగోడులో ఉప ఎన్నిక పోలింగ్ సర్వత్రe ఉత్కంఠ రేపుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్, బిజెపిల మధ్య మునుగోడు బైపోల్ వార్ తీవ్ర స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు జరుగుతున్న పోలింగ్ పై తెలంగాణలోని కీలక పార్టీలన్నీ ఫొకస్ పెట్టాయి. మునుగోడులో మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి 41.3% పోలింగ్ నమోదయింది. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
అయితే, ప్రస్తుత పోలింగ్ సరళిని పరిశీలిస్తే సాయంత్రానికి పోలింగ్ శాతం అనూహ్యంగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు, మునుగోడులో పోలింగ్ సందర్భంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ తన కామెడీ షోను కొనసాగించారు. ఉదయం నుంచి కొన్ని పోలింగ్ బూత్‌లను పరిశీలించిన పాల్ తాజాగా ఓ పోలింగ్ నుంచి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి పాల్ కు ఉంగరం గుర్తు కేటాయించగా 10 చేతులకు 10 ఉంగరాలతో కేఏ పాల్ పోలింగ్ బూత్ లలో కలియదిరుగుతున్నారు. దీంతో, ఇలా తిరగకూడదు కదా అని విలేకరులు ప్రశ్నించగా బయట టిఆర్ఎస్ కార్యకర్తలు కారులో తిరుగుతున్నారని వాళ్లు కూడా కారులో కాకుండా సైకిల్ పై వస్తారా అని పాల్ వెటకారంగా ప్రశ్నించారు.
ఇక, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో టిఆర్ఎస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. బిజెపికి పోలీసులు వత్తాసుపలుకుతున్నారని నిరసనకు దిగారు. పోలింగ్ కేంద్రం దగ్గరలో బిజెపి నాయకులు వచ్చినా పట్టించుకోవడంలేదని, తమను మాత్రం దూరంగా ఉండాలని ఆదేశిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, మూడు చోట్ల ఈవీఎంలు మార్చి పోలింగ్ నిర్వహిస్తున్నామని తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్ తెలిపారు. 28 ఫిర్యాదులు వచ్చాయని రెండు చోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 2018లో 91 శాతం పోలింగ్ నమోదు అయిందని వెల్లడించారు.
#WATCH | #Telangana : Independent candidate runs outside polling booth#Munugode #Bypoll #Telangana #MunugodeBypoll pic.twitter.com/6r7Q4XCixz
— TOI Hyderabad (@TOIHyderabad) November 3, 2022