వైసీపీ నాయకుడు, విశాఖపట్నం మాజీ ఎంపీ, ప్రముఖ నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ ఇంటిపై ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దాడులు చేస్తున్నారు. శుక్రవారం రాత్రే ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు ఓ హోటల్లో బస చేసినట్టు సమాచారం. అయితే.. వారు వచ్చిన విషయాన్ని అత్యం త గోప్యంగా ఉంచారు. శనివారం ఉదయాన్నే ఎంవీవీ ఇంటిపై దాడులకు దిగేవరకు ఏం జరుగుతోందనే విషయం ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచారు.
తొలుత మధువ వాడలోని ఎంవీవీ రియల్ ఎస్టేట్ కార్యాలయంలో తనిఖీలు ప్రారంభించిన ఈడీ అధికా రులు.. తర్వాత..విశాఖపట్నంలోని ఆయన నివాసం, మాజీ ఎంపీగా నిర్వహిస్తున్న కార్యాలయంపైనా దాడులు చేస్తున్నారు. అదేవిధంగా ఎంవీవీ వ్యాపార భాగస్వాముల ఇళ్ల పైనా.. ఆయన సన్నిహితులు, బంధువుల ఇళ్లపై కూడా నాలుగు బృందాలుగా విడిపోయిన ఈడీ అధికారులు సోదాలు చేస్తుండడం గమనార్షహం. మరీ ముఖ్యంగా ఎంవీవీకి గత పదేళ్లుగా ఆడిటర్ గా ఉన్న జీవీ ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు.
ఏంటి రీజన్..
ఎంపీగా ఉన్న సమయంలో ఎంవీవీ భారీ ఎత్తున విశాఖలో భూములు కొనుగోలు చేశారు. అయితే.. ఈ క్రమంలో కొందరిని బెదిరించారు. అయితే.. ఇలా భూములు కొనుగోలు చేసేందుకు .. ఆయన మనీలాండరింగ్ చేసినట్టు(విదేశాల నుంచి రహస్య మార్గాల్లో నిధులు తెచ్చుకున్నారన్నది) ఈడీకి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే భూముల కొనుగోళ్లకు సంబంధించి తనిఖీలు చేస్తున్నట్టు తెలిసింది. అయితే, ఎంవీవీ ప్రస్తుతం అందుబాటులో లేక పోవడం గమనార్హం.