తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “ఇలా ఎందుకు చేశారు? అలా చేయడం తప్పని మీకు తెలియదా? అయినప్పటికీ.. ఎందుకు అలా వ్యవహరించారు. మేం పదే పదే చెప్పాలా? ఎన్నికల నిబంధనల గురించి మీకు తెలియదా?“ అంటూ.. నిప్పులు చెరిగింది. అంతేకాదు.. ఎన్నికల నిబంధలను తుంగలో తొక్కారంటూ ప్రభుత్వాన్ని తీవ్రంగానే మందలించింది.
ఇటీవల మున్సిపాలిటిల్లో ప్రజాప్రతినిధుల జీతాల పెంపుపై ఈసీ మండిపడింది. ఈ వ్యవహారానికి సంబంధించి చీఫ్ సెక్రటరీ, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈసీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెంటనే సంబంధిత ప్రజాప్రతినిధుల జీతాల పెంపు జీవోను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెడుతోందని ఈసీకి విపక్షాలు వరుస ఫిర్యాదులుచేశారు.
బెదిరింపులకు పాల్పడుతున్నారని.. పనులు చేసి పెడతామని ఆశలు చూపుతున్నారని.. నిధులు ఇస్తాం.. వెనక్కి తగ్గాలంటూ.. సామ దాన బేధ దండోపాయాలను ప్రయోగిస్తున్నారంటూ.. కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ, కాంగ్రెస్‌లు వరుసగా ఫిర్యాదు చేశాయి. దీంతో ఆయా ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా స్పందించింది.
జిల్లా, మండల పరిషత్‌లకు రూ.250 కోట్ల నిధులను మంజురు చేయడంపై పంచాయితీరాజ్ కమీషనర్ శరత్‌ను ఎన్నికల సంఘం మందలించింది. ఎన్నికల ప్రక్రియకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత.. ఇలా నిదులు విడుదల చేయడం సరైన చర్యేనా? అలా మీరు భావిస్తే.. వివరణ ఇవ్వండి. అంతేకాదు, ఇలా చేయమని మిమ్మల్ని ఎవరు ప్రొత్సహించారో కూడా మాకు తెలపం.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక పంపాలని పంచాయితీ రాజ్ సెక్రటరీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పుడు ముగిసిన ఎన్నికల్లో జరిగిన తప్పులకు అధికారులు సమాధానం చెప్పాల్సి రావడం.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యూహాన్ని ఎలా వివరించాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.