దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం టీఆర్ఎస్ ను టెన్షన్ పెడుతోంది. తొలి 5 రౌండ్లు బీజేపీ ఆధిక్యం సాధించడంతో టీఆర్ఎస్ పార్టీకి వణుకు వచ్చింది. ఆరో రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యం మొదలైంది. ఓవరాల్ గా బీజేపీ ఆధిక్యంలో ఉంది. మొత్తం రౌండ్లు ముగిసే సరికి… పరిస్థితి ఎలా మారుతుందో ఎవరు గెలుస్తారో తెలియకపోయినా… దుబ్బాక ఎన్నికలు తెలంగాణలో బీజేపీ పుంజుకున్న విషయాన్ని మాత్రం స్పష్టం చేశాయి.
వచ్చే ఎన్నికలన్నిటీలో బీజేపీయే టీఆర్ఎస్ ప్రత్యర్థి అని దుబ్బాక తేల్చేసింది. వాస్తవానికి ఇది టీఆర్ఎస్ స్వయంకృతాపరాధమే. అనవసరంగా మోడీపై విమర్శలు చేయడం, హిందువులు నొచ్చుకునేలా ఎంఐఎంకు ప్రాధాన్యం ఇచ్చి వారిని సంకనెక్కించుకోవడం వల్ల బీజేపీని ప్రజల ఆదరించడం మొదలుపెట్టారు.
అదే సమయంలో కాంగ్రెస్ ను అధికారం వాడి అడ్డదారుల్లో తొక్కేయడంతో టీఆర్ఎస్ నచ్చని ప్రజలు మరో బలమైన శక్తి కోసం చూశారు. బీజేపీ అయితే బెటర్ అనుకుని అటువైపు మరలిపోయారు. కాంగ్రెస్ తొక్కేసినంత మాత్రాన టీఆర్ఎస్ వ్యతిరేకులు టీఆర్ఎస్ లోకి వస్తారు అని కేసీఆర్, కేటీఆర్ ఎలా అనుకున్నారో మరి.
మొత్తానికి దుబ్బాక టీఆర్ఎస్ పార్టీకి ఒక గుణపాఠంగా మాత్రం మిగిలింది. అయితే, ఇప్పటికే దిద్దుకోలేని తప్పు చేశారు.