తానా 2021-23 EVP గా పోటీ చేస్తున్న డా. నరేన్ కొడాలి్ శుక్రవారం నాడు తన ప్యానెల్ అభ్యర్థులతో న్యూజెర్సీ, బోస్టన్లలో పర్యటించారు. న్యూజెర్సీలోని ఎడిసన్ గోదావరి రెస్టౌరెంట్లో జరిగిన కార్యక్రమంలో నరేన్ ప్యానెల్లో పోటీలో ఉన్న పొట్లూరి రవి, మందలపు రవి, అద్దంకి పద్మలక్ష్మీ, సతీష్ తుమ్మల, ఫౌండేషన్ ట్రస్టీ గారపాటి విద్యా, మాజీ అధ్యక్షుడు గంగాధర్ నాదెళ్ల తదితరులు పాల్గొని స్థానిక ప్రవాసులతో సమావేశమై తమ ప్యానెల్ విజయానికి మద్దతు అందించాలని కోరారు.
గత ఆరు సంవత్సరాలుగా పాఠశాల ద్వారా విద్యార్థులకు తెలుగు బోధించడానికి నిర్విరామ కృషి చేస్తున్న శ్రీపద్మ లక్ష్మి అద్దంకి న్యూ జెర్సీ రీజినల్ కోఆర్డినేటర్ గా పోటీ చేయడానికి ముందుకు రావడం స్ఫూర్తిదాయకమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మహిళలు అన్నీ రంగాల్లో రాణిస్తున్నట్లే సమాజసేవ చేస్తూ తానా లాంటి సంస్థ ద్వారా తెలుగు కమ్యూనిటీ కి సేవ చేసుకునే అవకాశం కల్పించాల్సిందిగా శ్రీపద్మ లక్ష్మి న్యూ జెర్సీ తానా సభ్యులకు విజ్ఞప్తి చేసారు.
బోస్టన్ ప్రవాసులతో నరేన్ సమావేశమయ్యారు. సరికొత్త తానాను ఆవిష్కరించాలంటే తమ ప్యానెల్ అవసరాన్ని గుర్తించి తమకు ఓట్లు వేసి గెలిపించాలని ఆయన అక్కడి స్థానికులను అభ్యర్థించారు.
రెండో రోజూ న్యూ జెర్సీ లోనే..