అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోరు పారేసుకోవడంలో నెం.1 అని పేరు తెచ్చుకున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే ట్రంప్ ని ఎవరూ నమ్మని పరిస్థితి. స్వయంగా ఆ దేశా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్రంప్ పై తీవ్ర విమర్శలు చేశారంటే ట్రంప్ వ్యక్తిత్వం ఏంటో అర్థమవుతుంది. మొన్నే ఇండియాను, మోడీని పొగిడిన ట్రంప్…. ఇపుడు మురికి కంట్రీ అంటూ నోరు పారేసుకున్నారు.
ఇండియా, చైనా, రష్యా చూడండి… ఎంత మురికిగా ఉంటాయో. అక్కడ గాలి కూడా కలుసితమై ఉంటుంది అంటూ వ్యాఖ్యానించారు. డెమొక్రాట్లు ఇండియన్ అయిన్ కమల హ్యారిస్ ను తమ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంచుకోవడంతో ట్రంప్ కి దిమ్మతిరిగింది. ఎలాగూ తను ఇండియన్లు ఓట్లేయరు. వారిని తిడితే… వారి శత్రువుల ఓట్లు అయినా పడతాయనుకున్నాడేమో దారుణంగా మాట్లాడుతున్నాడు ట్రంప్. ఇంకా ఎంత దిగజారుతాడో చూడాలి.