టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తిరుపతికి చెందిన ప్రముఖ రియాల్టర్ ‘డాలర్స్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ డాక్టర్ సి. దివాకర్ రెడ్డి’ తెలుగుదేశం పార్టీలో చేరారు.
గురువారం నిడదవోలు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ‘డాలర్స్ దివాకర్ రెడ్డి’ని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా వేశారు.
చిత్తూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టిడిపి, కూటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని చంద్రబాబు ‘డాలర్స్ దివాకర్ రెడ్డి’ కి సూచించారు.
‘డాలర్స్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ డాక్టర్ సి దివాకర్ రెడ్డి’ గత రెండు దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల మన్ననలను పొందుతూ వస్తున్నారు.
దివాకర్ రెడ్డి తన రియల్ ఎస్టేట్ కంపెనీ ‘డాలర్స్’ పేరుని ఇంటిపేరుగా తిరుపతి జిల్లా ప్రజల నానుడిగా మారింది.
ఈయన కు ప్రధానంగా చంద్రగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి నియోజకవర్గాలలో యువత ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది.
అంతేకాకుండా దేవాలయాల నిర్మాణాలకు, గ్రామాలలో జాతర్ల నిర్వహణకు తమ వంతు ఆర్థిక సాయం చేస్తూవచ్చారు.
తిరుపతి జిల్లాలో యువతకు చదువుతోపాటు క్రీడలను ప్రోత్సహిస్తూ వారికి కావలసిన మౌలిక సదుపాయాలను కల్పిస్తుండటంతో యువత గుండెల్లో సముచిత స్థానం సంపాదించుకోగలిగారు.
అలాగే గత ఏడాది గతంలో ఎవరు చేయని విధంగా పోలీసు కుటుంబాలకు చెందిన పిల్లలు పది,ఇంటర్, ఆపై చదువులలో అత్యధిక మార్కులు సాధించిన వారిని ప్రోత్సహించేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నగదు రూపంలో ప్రోత్సాహాక స్కాలర్షిప్ లను ఇవ్వడం జరిగింది.
టిడిపిలో చేరిన సందర్భంగా ‘డాలర్స్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ డాక్టర్ సి దివాకర్ రెడ్డి’ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విధివిధానాలు, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ల నాయకత్వంలో పనిచేయాలని ఆలోచనతో చేరడం జరిగిందన్నారు.
ఈ సార్వత్రిక ఎన్నికలలో తిరుపతి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపుతో పాటు బిజెపి జనసేన టిడిపి కూటమి అభ్యర్థుల విజయానికి శక్తివంచన లేకుండా పని చేస్తానని చెప్పారు.
టిడిపి పార్టీ అధికారంలోకి వచ్చేలా చేయడమే లక్ష్యం అని, చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయడమే తన ధ్యేయమని దివాకర్ రెడ్డి మీడియాకు తెలిపారు.
‘డాలర్స్ దివాకర్ రెడ్డి’ తో పాటు పలువురు యువత చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు.
ఈ కార్యక్రమంలో చంద్రగిరి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని, టిడిపి రాష్ట్ర నేత వలపుల దశరథ నాయుడు, చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.