టెన్నిస్ కోర్టులోకి దిగినంతనే.. ఎదురులేని రీతిలో ఆడే సెర్బియా టెన్నిస్ క్రీడాకారుడు ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ కు ఊరట లభించింది. తన కెరీర్ లో 21వ గ్రాండ్ స్లామ్ ను సొంతం చేసుకునేందుకు ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురు కావటం తెలిసిందే. వ్యాక్సినేషన్ లేకుండా వచ్చిన తీరుపై ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన్ను అడ్డుకోవటం.. గంటల తరబడి ఎయిర్ పోర్టులోనే నిలిపి ఉంచటం.. ఆయన వీసాను రద్దు చేయటం లాంటివి చోటు చేసుకోవటం తెలిసిందే.
తమ దేశ ఆటగాడు..ఆస్ట్రేలియా ఎయిర్ పోర్టులో చిక్కిపోవటం.. అక్కడి అధికారుల తీరుపై సెర్బియా ప్రధాని పైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జకొ వెంటనే సెర్బియా దేశం మొత్తం ఉందని ప్రకటన చేశారు. ఇదిలా ఉంటే.. తమ దేశ వ్యాక్సినేషన్ నిబంధనల్ని జొకో పాటించలేదని ఆస్ట్రేలియా అధికారులు పేర్కొన్నారు. ఈ వ్యవహారం చివరకు కోర్టుకు చేరుకుంది.
తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం మీద జకోవిచ్ కేసు వేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా వ్యాక్సినేషన్ పై వైద్య పరమైన మినహాయింపు వచ్చిన తర్వాతే ఆటగాడి నిలిపివేత.. బహిష్కరణ సరికాదని పేర్కొన్న ఫెడరల్ సర్య్కూట్ కోర్టు.. జకోవిచ్ ను తక్షణమే నిర్బంధ క్వారంటైన్ నుంచి విడుదల చేయాలని పేర్కొంది. అంతేకాదు..రద్దు చేసిన వీసాను పునరుద్దరించాలని పేర్కొంది. వ్యాక్సిన్ మినహాయింపు కోసం అవసరమైన అన్ని పత్రాల్ని జకోవిచ్ ఇచ్చినందున.. అతను చేయాల్సిందేమీ లేదని పేర్కొన్నారు.
కోర్టు తీర్పుతో జకోవిచ్ విజయం సాధించినట్లుగా అనుకోలేమని చెబుతున్నారు. దీనికి కారణం.. ఫెడరల్ కోర్టు తీర్పుతో గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఆడే అవకాశం ఉండదని చెబుతున్నారు. దీనికి కారణం ఆస్ట్రేలియాలోని నిబంధనలేనని చెబుతున్నారు. ఆ దేశ నిబంధనల ప్రకారం వీసాను రెండోసారి రద్దు చేసే విశేష అధికారం ప్రభుత్వానికి ఉంది. ఒకవేళ ఆస్ట్రేలియా ప్రభుత్వం తమపై కోర్టుకు ఎక్కిన జకోవిచ్ వీసాను రెండోసారి రద్దు చేసే విశేష అధికారం ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ఉంది. ఈ నేపథ్యంలో కోర్టులో తీర్పు తనకు అనుకూలంగా ఉన్నప్పటికీ.. ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ఉన్న విశేషమైన అధికారంతో ఏం జరగనుందన్నది సస్పెన్స్ గా మారింది.