• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

పార్లమెంటులో జగన్ పరువు తీసిన వైసీపీ ఎంపీ

కేంద్రం దగ్గర దిశ బిల్లు పెండింగ్ అన్న ఎంపీ మాధవ్...ఏపీ దగ్గరే ఉందని కేంద్రం సమాధానం

admin by admin
July 28, 2021
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
793
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీలో ఉన్నది మహిళా పక్షపాత ప్రభుత్వమని, మహిళలకు అన్ని రంగాల్లో జగన్ పెద్దపీట వేశారని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. మహిళల రక్షణకు జగన్ దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ చట్టం, యాప్ తీసుకువచ్చారని ప్రచారం చేసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం జగన్ కూడా దిశ యాప్ పై ఓ భారీ కార్యక్రమం నిర్వహించి యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటూ పోలీసు శాఖ ద్వారా నానా హంగామా చేయించారు.

అయితే, గత ప్రభుత్వంలో నాటి సీఎం చంద్రబాబు ’ఫోర్త్‌ లయన్‌ యాప్‌’ను కాపీ కొట్టి చట్టబద్ధత లేని దిశ యాప్‌ గా మార్చారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు, దిశ చట్టం ఇంకా ఆమోదం పొందలేదని, కేంద్రం ఆమోదించగానే ఏపీలో దిశ చట్టం అమలు చేస్తామని బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టారు వైసీపీ నేతలు. తాజా పార్లమెంటు సమావేశాల్లో దిశ చట్టానికి ఆమోదముద్ర వేయించాలంటూ తన ఎంపీలకు హుకుం జారీ చేశారు జగన్.

అయితే, జగన్ మెప్పు పొందాలన్న హడావిడిలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అడిగిన ప్రశ్న వైసీపీ పరువు తీసింది. దిశ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపామని, ఆ వ్యవహారం ఎక్కడిదాకా వచ్చిందంటూ పార్లమెంటులో మాధవ్ లిఖిత పూర్వక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ కుమార్‌ మిశ్రా లిఖిత పూర్వక జవాబిచ్చారు. ఆ యాప్ పై కేంద్రానికి వచ్చిన అభ్యంతరాలు, అనుమానాలను నివృత్తి చేయాలంటూ ఏపీ సర్కార్‌కు దిశ బిల్లును తిరిగి పంపామని ఆయన చెప్పడంతో మాధవ్ తో పాటు వైసీపీ ఎంపీలు షాక్ తిన్నారు.

దిశ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం ఏపీ ప్రభుత్వం పంపించిందని, ఆమోద ప్రక్రియలో భాగంగా సంబంధిత మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు ప్రారంభించామని ఆయన వెల్లడించారు. అయితే, దిశ బిల్లుపై ఆయా శాఖలు లేవనెత్తిన సందేహాలు, పరిశీలనలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరామని, అయితే, ఇప్పటిదాకా ఏపీ సర్కార్ నుంచి జవాబు రాలేదని పార్లమెంటు సాక్షిగా వెల్లడించడంతో మాధవ్‌కు మైండ్ బ్లాంక్ అయినంత పనైంది. అసలు విషయం తెలుసుకోకుండా అనవసరంగా తమ పార్టీ పరువు పార్లమెంటు సాక్షిగా పోయిందని వైసీపీ ఎంపీలు మదనపడ్డారట.

Tags: ap cm jagandisha billdisha bill pending in apinsult to apshocking factycp mp gorantla madhav
Previous Post

జ‌గ‌న్ మ‌రో వివాదాస్ప‌ద నిర్ణ‌యం.. ఇలా అయితే.. ఏపీ నాశ‌న‌మే!

Next Post

AP: నోరెత్తితే కేసు!

Related Posts

Trending

అమరావతే రాజధాని..కేంద్ర మంత్రి స్వీట్ న్యూస్

February 8, 2023
kotam reddy sridhar reddy
Trending

బోరుగడ్డ ఆఫీసు దగ్ధంపై కోటంరెడ్డి రియాక్షన్

February 8, 2023
Trending

స్మితతో చిరంజీవి నిజం చెప్పారా? ప్రోమో వైరల్

February 8, 2023
Top Stories

లిక్కర్ స్కామ్‌లో కవిత మాజీ సీఏ బుచ్చిబాబు అరెస్ట్

February 8, 2023
Trending

సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న జ‌గ‌న్ పాట‌

February 8, 2023
lokesh rally
Politics

మోసానికి ఫ్యాంటు చొక్కా తొడిగితే.. జ‌గ‌న్‌

February 8, 2023
Load More
Next Post

AP: నోరెత్తితే కేసు!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • అమరావతే రాజధాని..కేంద్ర మంత్రి స్వీట్ న్యూస్
  • బోరుగడ్డ ఆఫీసు దగ్ధంపై కోటంరెడ్డి రియాక్షన్
  • స్మితతో చిరంజీవి నిజం చెప్పారా? ప్రోమో వైరల్
  • లిక్కర్ స్కామ్‌లో కవిత మాజీ సీఏ బుచ్చిబాబు అరెస్ట్
  • సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న జ‌గ‌న్ పాట‌
  • మోసానికి ఫ్యాంటు చొక్కా తొడిగితే.. జ‌గ‌న్‌
  • `వై నాట్‌`తో ఉతికేసిన నారా లోకేష్‌.. ఏమ‌న్నారంటే!
  • త్వ‌ర‌లోనే కాంగ్రెస్ స‌ర్కార్‌:  రేవంత్‌
  • రగులుతున్న కృష్ణా.. టీడీపీ నేత‌ల అరెస్టులు.. రీజ‌నేంటి?
  • హైకోర్టుకు పయ్యావుల…జగన్ కు షాక్
  • జగన్ కు కొత్త పేరు పెట్టిన పవన్
  • బాబు, పవన్ ల పొత్తుపై అమర్ నాథ్ అక్కసు
  • రూ.300 కోట్లకు పేర్ని నాని స్కెచ్
  • బాబూ మోహన్ బూతు పురాణం..వైరల్
  • బాలకృష్ణ కు వ్య‌తిరేకంగా కుట్ర‌?

Most Read

కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం

ఒక్క ప్రశ్నతో వైసీపీ వాళ్లకు దిమ్మతిరిగింది… అందరూ సైలెంట్

హైకోర్టుకు పయ్యావుల…జగన్ కు షాక్

టాలీవుడ్లో భారీ సెక్స్ రాకెట్

ఎంత పని చేశావ్ … ఒక్క వీడియోతో జగన్ కి జ్వరం తెప్పించావే

బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra