ప్రముఖ డైరెక్టర్ శంకర్ ఇంట పెళ్లి బాజా మోగనుంది. ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య వివాహం ఆదివారం అంగరంగ వైభవంగా జరగుతుంది. అయితే శంకర్ అల్లుడయ్యేది ఎవరా? అని చిత్రసీమలో ఆసక్తి నెలకొంది.
తమిళనాడు క్రికెటర్ రోహిత్ దామోదరన్‌తో ఐశ్వర్య మూడుముళ్ళు వేయించుకోనుంది. రోహిత్ తమిళనాడు క్రికెట్ లీగ్‌లో ఆడుతున్నాడు. రోహిత్ తండ్రి దామోదరన్ చెన్నైలో ప్రముఖ పారిశ్రామిక వేత్త. అంతే కాకుండా మదురై పాంథర్స్ టీమ్‌కు ఆయన యజమాని. ఐశ్వర్యేమో వైద్యురాలు. కరోనా నేపథ్యంలో తక్కువ మంది ఆప్తుల సమక్షంలో వీళ్ల పెళ్లి మహాబలిపురంలో జరుగుతుంది.
మరోవైపు సినిమాల పరంగా చూసుకుంటే.. శంకర్ ప్రస్తుతం ‘అపరిచితుడు’ హిందీ రీమేక్, ‘రామ్‌చరణ్15’ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వాటికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
రామ్‌చరణ్‌తో తెరకెక్కించే చిత్రానికి దిల్‌రాజు నిర్మాత. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం షూటింగ్ ముసిగిన తర్వాత ఈ సినిమాను మొదలెట్టే అవకాశాలున్నాయి. మరోవైపు తమిళం, తెలుగులో గొప్ప విజయాన్ని అందుకున్న ‘అపరిచితుడు’ సినిమా హిందీ రీమేక్‌లో రణ్వీర్ సింగ్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే.