బాలీవుడ్లో పెద్ద విషాదం చోటు చేసుకుంది. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌గా గుర్తింపు ఉన్న సంజయ్ గాద్వి హఠాత్తుగా కన్ను మూశాడు. ఆయన వయసు 57 సంవత్సరాలు. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో సంజయ్ గాద్వి మరణించాడు. సంజయ్ ఈ మధ్య అంత యాక్టివ్‌గా లేడు కానీ.. బాలీవుడ్లో కొన్ని ఆల్ టైం బ్లాక్బస్టర్లు ఇచ్చిన దర్శకుడిగా ఆయనకు గొప్ప పేరే ఉంది. హిందీ సినిమా చరిత్రలో ట్రెండ్ సెట్టింగ్ మూవీ ఫ్రాంచైజీ అయిన ‘ధూమ్’ను మొదలుపెట్టింది ఆయనే. బాలీవుడ్లో ఫ్రాంఛైజీ చిత్రాలు ఊపందుకోవడానికి ‘ధూమ్’యే కారణం అన్న సంగతి తెలిసిందే. 2001లో ‘తేరే లియే’ సినిమాతో సంజయ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అది ఫ్లాప్ అయింది. ఐతే తర్వాతి ఏడాది వచ్చిన ‘మేరే యార్ కి షాదీ హై’ సినిమా సక్సెస్ అయి సంజయ్‌కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
ఐతే సంజయ్ పేరు మార్మోగింది మాత్రం 2004లో వచ్చిన ‘ధూమ్’ సినిమాతోనే. ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ యూత్‌ను ఒక ఊపు ఊపేసింది. అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహాం ఇందులో కీలక పాత్రలు పోషించారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ కాగా.. దొంగగా జాన్ స్థానంలో హృతిక్ రోషన్‌ను పెట్టి అభిషేక్‌ను పోలీస్ పాత్రలో కొనసాగిస్తూ ‘ధూమ్-2’ తీసింది యశ్ రాజ్ ఫిలిమ్స్. సంజయే డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 2006లో రిలీజై సెన్సేషనల్ హిట్టయింది. అప్పటికి బాలీవుడ్ చరిత్రలోనే అది అతి పెద్ద బ్లాక్బస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఐతే ‘ధూమ్-3’ తీసే అవకాశం సంజయ్‌కి దక్కలేదు. అతను ఆ తర్వాత తీసిన కిడ్నాప్, అజబ్ గజబ్ లవ్, సినిమాలు సరిగా ఆడలేదు. దీంతో కెరీర్లో బాగా గ్యాప్ వచ్చింది. ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత 2020లో అతడి నుంచి వచ్చిన ‘ఆపరేషన్ పరిందే’ కూడా సరిగా ఆడలేదు. తర్వాత సంజయ్ వార్తల్లో లేడు. ఇప్పుడు ఆయన మరణ వార్త బయటికి వచ్చింది.
Director of film #Dhoom #SanjayGadhvi died because of heart attack, when he was doing morning walk. I believe, so many people are getting heart attack because of use of Corona vaccine. Corona vaccine is the biggest scam in the world. RIP.