టాలీవుడ్ లో ఏ ఎన్నికలు జరిగినా.. ఉత్కంఠభరితమే. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అయినా.. తాజాగా జరిగిన నిర్మాతల మండలికి చెందిన వాణిజ్య మండలి ఎన్నికలైనా.. ఆది నుంచి ఉత్కంఠగానే జరిగాయి. ఈ ఎన్నికల్లో తాజాగా సెన్సేషనల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు విజయం దక్కించుకున్నారు. ఉత్కంఠగా జరిగిన ఈ ఎన్నికలు ఆది నుంచి టెన్షన్ పెట్టాయి. ప్రత్యర్థి పక్షంలోనూ బలమైన నిర్మాత సీ. కళ్యాణ్ ఉండడంతో దిల్ రాజు విజయం అంత ఈజీగా అయితే దక్కలేదు.
అగ్ర నిర్మాతలు సి.కల్యాణ్, దిల్ రాజు ప్యానళ్ల మధ్య ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. నిర్మాతల సెక్టార్లో మొత్తం 891 ఓట్లు పోల్ కాగా, 563 ఓట్లు దిల్‌రాజు ప్యానల్‌కు పడ్డాయి. దీంతో దిల్‌రాజు అధ్యక్షపగ్గాలు చేపట్టనున్నారు. ఇక, ఈ పదవి కోసం రంగంలోకి దిగి.. ఆది నుంచి ఉత్సాహంతో విజయంపై నమ్మకంతో ఉన్న సీ. కళ్యాణ్ ప్యానల్‌కు కేవలం 497 ఓట్లు మాత్రమే పడ్డాయి. దీంతో ఆయన, ఆయన కూటమి ఓటమి చెందినట్టయింది. అయితే.. సెక్టార్ ప్రెసిడెంట్ ఓట్లు 4 ఇప్పుడు కీలకంగా మారాయి.
ఏయే సెక్టార్లలో గెలుపెవరిది?
+ స్డూడియో సెక్టార్లో గెలిచిన నలుగురిలో ముగ్గురు దిల్ రాజు ప్యానల్‌కు చెందినవారు.
+ డిస్ర్టిబ్యూషన్ సెక్టార్లో ఇరు ప్యానల్స్ తరపున చెరో ఆరుగురు గెలుపొందారు.
+ ఎగ్జిబిటర్ సెక్టర్లో ఏకగ్రీవంగా ఎన్నికైనా వారు కూడా దిల్ రాజుకే మొగ్గు చూపనున్నారు.
గెలిచిన వర్గాలు..
+ ప్రొడ్యూసర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి 12. దిల్ రాజు కి 7, సి కళ్యాణ్ కి 5
+ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ 12, దిల్ రాజు కి 6, సి కళ్యాణ్ కి 6.
+ స్టూడియో ఎక్సిక్యూటివ్ కమిటీ 4, దిల్ రాజుకి 3, సి కళ్యాణ్ కి 1.
+ ఎగ్జిబిటర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ 16, దిల్ రాజుకి 8 , సి కళ్యాణ్ కి 8.