నాయకుడంటే జనం మధ్యలో ఉండాలి… జనంతో కలిసి తిరగాలి….మనలో ఒకడు అని ప్రజలు ఆ నాయకుడిని ఓన్ చేసుకునేలా అతడి ప్రవర్తన ఉండాలి. తమ ఇంట్లో వండింది…తమతో కలిసి తిని తమ మనిషిగా జనం ఫీల్ అయ్యే వాడే అసలు సిసలు నాయకుడు అవుతాడు. అలా కాకుండా జనం ముందు కేవలం నటన కోసం, షో చేయడం కోసం వారిలో ఒకడిగా జీవించే వ్యక్తి ఎప్పటికీ నాయకుడు కాలేడు. అంతేకాదు, జనం మెప్పుకోసం ఫోటోల కోసం వారు పెట్టింది తిన్నట్టుగా నటించేవాడు ఎన్నటికీ నాయకుడు కాలేడు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ మొదట చెప్పిన నాయకుల కేటగిరీలోకి వస్తారు…ఇక, వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ చివరగా చెప్పిన నాయకుల కేటగిరిలోకి వస్తారు.
ఇందుకు, తాజాగా జరిగిన ఓ ఘటనే నిదర్శనం. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా పలు ప్రాంతాల్లో ప్రకటిస్తున్న లోకేష్ టిడిపి కార్యకర్త ఇంటిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆ ఇంట్లోనే మహిళలు నారా లోకేష్ కు పాయసం ఆఫర్ చేశారు.
అయితే, వాస్తవానికి తాను పాయసం తిననని, కానీ ప్రేమగా ఇస్తున్నారు కాబట్టి వద్దనకుండా తింటానంటూ లోకేష్ పెద్దమనసు చాటుకున్నారు. అంతేకాదు, పాయసం చాలా బాగుందంటూ ఆ ఇంట్లోని మహిళలకు కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. ఇచ్చిన పాయసాన్ని తాను మాత్రమే తినడం కాకుండా కార్యకర్తలతోనూ లోకేష్ పంచుకున్నారు. అందరూ తినాలంటూ వారందరికీ పాయసాన్ని ఇవ్వమని లోకేష్ చెప్పారు.
గతంలో, జగన్ ఓ కార్యకర్త ఇచ్చిన ఆహారాన్ని తిన్నట్లు నటించి ఫొటోలకు ఫోజులిచ్చారు. దీంతో జగన్ కి లోకేష్ కి ఉన్న తేడా ఇదే అంటూ సోషల్ మీడియాలో టిడిపి కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జగన్ లాగా తిన్నట్టు నటించలేదు అభిమానంతో ఇచ్చిన పాయసం ప్రేమతో తిన్నాడు ???? pic.twitter.com/gTftsnd1wb
— I Love India✌ (@Iloveindia_007) November 11, 2022